రిలీజ్ తర్వాత మాష్టారు ఏడాది రెస్ట్!
`పుష్ప` మొదలైన నాటి నుంచి దర్శకుడు సుకుమార్ ఆ సినిమా పనుల్లోనే బిజీ బిజీగా గడుపుతున్నారు.
`పుష్ప` మొదలైన నాటి నుంచి దర్శకుడు సుకుమార్ ఆ సినిమా పనుల్లోనే బిజీ బిజీగా గడుపుతున్నారు. అప్పుడప్పుడు గ్యాప్ తీసుకునే సినిమా గురించే ఆలోచించాల్సిన పరిస్థితులు తప్ప రిలాక్స్ అయ్యే మూడ్ లో కనిపించలేదు. టీమ్ అందరికీ ఏదో సందర్భంలో కొంత గ్యాప్ దొరికింది కానీ...సమయం దొరికినా సుకుమార్ సినిమా సినిమా అంటూ నిరంతరం జపం చేసే మనిషి. దీనికి తోడు సినిమా ఎలా వస్తుందా? అన్న టెన్షన్ ఆయనకు తొలి నుంచి ఉండనే ఉంది.
ఇలా ఇన్ని రకాల టెన్షన్లతోనే `పుష్ప` మొదలు పెట్టారు. మొదటి భాగాన్ని గ్రాండ్ చేసారు. ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్ కూడా ముగింపు దశకుచేరుకున్న సంగతి తెలిసిందే. మూడేళ్ల నుంచి పుష్ప-2 పనుల్లోనే బిజీ అయ్యారు. తొలి భాగం భారీ విజయం సాధిచడంతో రెండవ భాగాన్ని మరింత బాధ్యతగా తీయాల్సిన పరిస్థితులు. దీంతో కథ విషయంలో సుకుమార్ చాలాసార్లు రివ్యూ చేసుకుని అంతా పక్కాగా అనుకున్నాకే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టారు.
అప్పటి నుంచి నిర్విరామంగా షూటింగ్ జరుగుతూనే ఉంది. సెట్స్ లో చిత్రాన్ని చెక్కుతూనే ఉన్నారు. పర్పెక్షన్ విషయంలో సుకుమార్ ఎక్కడా తగ్గరు. రషెస్ చూసుకుని అసవరం మేర రీషూట్లకు వెళ్తుం టారు. ఈ సినిమా విషయంలో అలా చాలా సార్లు జరిగింది. అవసరం మేర అప్పటికప్పుడు కొత్తగా నటీనటుల్ని ఎంపిక చేసారు. ఇక ఐటం పాట విషయంలో ఏ భామని తీసుకోవాలి? అన్న దానిపై నెలలుగా చర్చ సాగుతూనే ఉంది.
కానీ ఇంత వరకూ ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. ఇంకా తర్జన భర్జన కొనసాగుతూనే ఉంది. ఎలాగూ డిసెంబర్ లో రిలీజ్ అవుతుంది కాబట్టి అప్పటి నుంచి ఏడాది పాటు సుకుమార్ విశ్రాంతి తీసుకుంటారని తాజాగా సన్నిహిత వర్గాల నుంచి లీకైంది. ఎలాంటి కథలు రాసే అవకాశం లేదని , పూర్తిగా ఫ్యామిలీకే సమయాన్ని కేటాయిస్తారని సమాచారం. రామ్ చరణ్ 17వ చిత్రం సెట్స్ కి తీసుకెళ్లాలంటే చరణ్ పూర్తిగా తనకి బాండ్ అయి పనిచేయాలట. ఈ క్రమంలో చరణ్ ప్రీగా దొరికే అవకాశం లేదు. అప్పటికి బుచ్చిబాబు సినిమా షూట్ పీక్స్ లో ఉంటుంది. అప్పుడు సుకుమార్ మొదలు పెడితే శిష్యుడు అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంటుందని, అతడి సినిమా పూర్తయ్యే వరకూ సుకుమార్ పట్టాలెక్కించరని తెలిసింది. మరి ఈ ప్రచారంలో వాస్తవం తెలియాల్సి ఉంది.