పుష్ప 2 ఆలస్యం.. ఒక్క మాటలో క్లారిటీ ఇచ్చేసిన సుక్కు
ఇప్పటికే పుష్ప-2 నుంచి వచ్చిన అప్డేట్స్ అదిరిపోయే రెస్పాన్స్ అందుకున్నాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప-2 మూవీ కోసం అటు బన్నీ అభిమానులు.. ఇటు వరల్డ్ వైడ్ సినీ ఫ్యాన్స్ ఎంతో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్న పుష్ప-2.. షూటింగ్ కంప్లీట్ అవ్వకపోవడంతో వాయిదా వేశారు. దీంతో అభిమానులు నిరాశ చెందారు. కానీ మూవీ టీమ్ పై నమ్మకంతో సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు డిసెంబర్ 6 వస్తుందోనని చూస్తున్నారు.
ఇప్పటికే పుష్ప-2 నుంచి వచ్చిన అప్డేట్స్ అదిరిపోయే రెస్పాన్స్ అందుకున్నాయి. గ్లింప్సెస్ ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. ఇక సాంగ్స్ అయితే చెప్పనక్కర్లేదు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన రెండు పాటలు కూడా చార్ట్ బస్టర్ గా నిలిచాయి. అయితే ఫస్ట్ పార్ట్ కు వచ్చిన రెస్పాన్స్ ను దృష్టిలో పెట్టుకుని సుకుమార్ సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు. ప్రతీ విషయంలో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటున్నారు. ఒక్కో సీన్ రెండు మూడు సార్లు షూట్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
రీసెంట్ గా ఈ విషయాన్ని సుకుమారే ఒప్పుకున్నారు! ఫ్యాన్స్ కు మంచి అవుట్ పుట్ ఇచ్చేందుకు రెస్ట్ తీసుకోకుండా కష్ట పడుతున్నట్లు తెలిపారు సుకుమార్. కొన్ని సీన్స్ కు ఎక్కువ టైమ్ తీసుకుంటున్నామని చెప్పారు. మూవీ క్వాలిటీ విషయంలో అస్సలు రాజీపడనని క్లారిటీ ఇచ్చారు. అందుకే పుష్ప-2 షూటింగ్ లేట్ అవుతుందని చెప్పారు. కచ్చితంగా అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ తోపాటు సినిమాలో అన్ని సీన్స్ అద్భుతంగా ఉంటాయని చెప్పి మరోసారి అంచనాలు పెంచారు.
ప్రస్తుతం క్లైమాక్స్ షూట్ జరుగుతుందని తెలిపారు. అయితే రావు రమేష్ మారుతీ నగర్ సుబ్రమణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన ఆయన.. ఈ విషయాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడేందుకు మైక్ పట్టగానే.. అభిమానులంతా పుష్ప.. పుష్ప అని గట్టిగా అరిచారు. దీంతో క్లైమాక్స్ షూట్ జరుగుతోందని, డిస్టర్బ్ చేస్తే ఇబ్బంది పడాలని అన్నారు. ఆ మధ్య సుకుమార్, బన్నీ మధ్య గొడవ వచ్చిందని.. అందుకే అల్లు అర్జున్ గెడ్డం తీశాడని వార్తలు చక్కర్లు కొట్టాయి.
కానీ సినిమా షూటింగ్ అప్డేట్ తో.. రూమర్స్ కు చెక్ పెట్టారు సుకుమార్. అయితే పుష్ప ఫ్రాంచైజీ సీక్వెల్ తో ఆగదని.. మరో ఐదారు పార్టులు తీస్తానని సరదాగా అన్నారు. ఏదేమైనా పుష్ప-2 విషయంలో సుకుమార్ పై ఎంత ప్రెజర్ ఉందో ఈజీగా అర్థమవుతుంది. సినిమాను ప్రస్టేజియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తుంది. క్వాలిటీలో తగ్గేదేలే అంటూ ముందుకెళ్తున్నట్లు క్లారిటీ వస్తుంది. అందుకే ఒక సీన్ రిపీట్ మోడ్ లో తీయాల్సి వస్తుందని ఇన్ డైరెక్ట్ గా తెలిపారు. మరి చివరకు సినిమాతో సుక్కూ ఎలా మెప్పిస్తారో వేచి చూడాలి.