సంక్రాంతికి రిలీజ్ అన్నారు.. ఆ సినిమా ఏమైంది..?

సోలో హీరోగానే కాదు సరైన పాత్ర పడితే స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటిస్తూ వస్తున్నాడు.

Update: 2024-12-31 04:10 GMT

యువ హీరోల్లో కొత్త కథలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలని చూసే వారిలో సందీప్ కిషన్ ఒకరు. అతను చేస్తున్న సినిమాలు కమర్షియల్ గా ఒక రేంజ్ లో సక్సెస్ కాకపోయినా ఆడియన్స్ కు ఏదో ఒక కొత్త కథ చెప్పాలనుకునే అతని తాపత్రయం కనబడుతుంది. సోలో హీరోగానే కాదు సరైన పాత్ర పడితే స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటిస్తూ వస్తున్నాడు. సందీప్ కిషన్ సక్సెస్ గ్రాఫ్ పైకి ఎగరకపోయినా అతను మాత్రం రాబట్టుకోవాల్సిన ఐడెంటిటీ సంపాదించాడని చెప్పొచ్చు.

సోలోగా సినిమాలు చేస్తూ ఇంపార్టెంట్ రోల్ ఏదైనా వస్తే ఇతర హీరోల సినిమాలు కూడా చేస్తున్నాడు. ఈ ఇయర్ కెప్టెన్ మిల్లర్ తో మొదలు పెట్టిన సందీప్ కిషన్ అది వర్క్ అవుట్ కాకపోవడంతో ఊరు పేరు భైరవకోన చేశాడు. ఆ సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ అయ్యింది. ఇక ధనుష్ డైరెక్షన్ లో వచ్చిన రాయన్ లో నటించి మెప్పించాడు సందీప్ కిషన్. నెక్స్ట్ ఇయర్ సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీతో రాబోతున్నాడు సందీప్ కిషన్.

ఐతే సందీప్ కిషన్ లీడ్ రోల్ లో ధమాకా డైరెక్టర్ నక్కిన త్రినాథ రావు డైరెక్షన్ లో మజాకా అనే సినిమా మొదలు పెట్టారు. ఆ సినిమా సంక్రాంతికి రిలీజ్ అని అనౌన్స్ కూడా చేశారు. తీరా చూస్తే సంక్రాంతి రేసు నుంచి ఆ సినిమా తప్పుకున్నట్టే అనిపిస్తుంది. ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్న సినిమాల హంగామా మొదలైంది. రాం చరణ్ గేమ్ ఛేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం ఈ సినిమాలే పొంగల్ రేసులో దిగుతున్నాయి.

ఈ సినిమాల మధ్య మరో సినిమా వచ్చే సాహసం చేయదని చెప్పొచ్చు. ఐతే సందీప్ కిషన్ మజాకాని అసలైతే సంక్రాంతికి టార్గెట్ పెట్టుకున్నారు కానీ మళ్లీ పోటీ ఎందుకని వెనక్కి తగ్గినట్టు ఉన్నారు. సందీప్ 2024 లో కూడా సంక్రాంతికి ఊరు పేరు భైరవ కోన రిలీజ్ చేయాల్సింది. కానీ అప్పుడు కుదరలేదు. తర్వాత రిలీజ్ చేసి సక్సెస్ అందుకున్నారు. మరి అదే సెంటిమెంట్ మజాకాకి కలిసి వచ్చి ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందేమో చూడాలి. తన సినిమాలతో ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్న డైరెక్టర్ త్రినాథరావు నక్కిన సందీప్ కిషన్ తో చేస్తున్న మజాకా కూడా నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని తెలుస్తుంది. మరి ఈ సినిమాతో సందీప్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

Tags:    

Similar News