విసుగొచ్చి న‌టించ‌డం మానేసిన న‌టి!

ఇండ‌స్ట్రీలో మ‌హిళా క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల ప‌రిస్థితి ఎలా ఉంటుంద‌న్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు

Update: 2024-06-08 04:00 GMT

ఇండ‌స్ట్రీలో మ‌హిళా క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల ప‌రిస్థితి ఎలా ఉంటుంద‌న్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. ముఖ్యంగా అమ్మ‌.. అక్క‌..చెల్లి..వ‌దిన పాత్ర‌లు చాలా సినిమాల్లో కామ‌న్ గా ఉంటాయి. ఆ పాత్ర‌ల‌కు అందులో పాపుల‌ర్ అయిన న‌టీమ‌ణుల్నే తీసుకుంటారు. దాదాపు అన్ని సినిమాల్లోనూ ఇది రిపీటెడ్ గా జ‌రుగుతుంటుంది. వాళ్ల‌ను అలాంటి పాత్ర‌లకు త‌ప్ప మ‌రో పాత్ర‌ల్లో ఓన్ చేసుకోవ‌డం క‌ష్ట‌మ‌ని ద‌ర్శ‌క‌-ర‌చ‌యిత‌లు అలాంటి పాత్ర‌లే రాస్తుంటారు.

తాజాగా బాలీవుడ్ న‌టి సునీతా రాజ్ వార్ కి కూడా ఇలాంటి ప‌రిస్థితే ఎదురైంది. బాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌లో తన పరిస్థితి ఎలా ఉంద‌న్న‌ది వివ‌రించింది. చ‌దువైన వెంట‌నే సినిమా అవ‌కాశాలొచ్చాయి. అయితే ఎప్పుడూ ఒకే ర‌క‌మైన పాత్ర‌లు ఇచ్చారు. ప‌ని మ‌నిషి పాత్ర‌లో నేను బాగా ఫేమ‌స్ అవ్వ‌డంతో న‌టించిన సినిమాల్లో అన్నీ అవే పాత్ర‌లు పోషించాను. అవి చేసి చేసి నాకు కూడా బోర్ కొట్టింది. అందుకే యాక్టింగ్ నుంచి బ్రేక్ తీసుకున్నా.

స‌రైన పాత్ర‌లు రాక‌పోవ‌డంతోనే సినిమాలు తగ్గించాను. ప‌నిమనిషిగా న‌టించొద్ద‌ని ఫిక్స్ అయ్యాను. ఇప్పుడిలాంటి పాత్ర‌ల‌తో ఎవ‌రైనా వ‌స్తే చేయ‌న‌ని చెప్పేస్తున్నా.అందువ‌ల్ల మంచే జ‌రిగింది. ఇప్పుడు భిన్న ర‌కాల పాత్ర‌లు వ‌స్తున్నాయి. న‌చ్చిన పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల్ని న‌వ్వించ‌గ‌ల అవ‌కాశం ద‌క్కుతుంది. చిన్న దానికే విమ‌ర్శించ‌డం ప‌నిగా పెట్టుకున్న ఈ రోజుల్లో ప్రేక్ష‌కుల ప్రేమ‌ను పొంద‌డం అంత ఈజీ కాదు.

కానీ నాపై ప్ర‌త్యేక‌మైన ప్రేమాభిమానం కురిపిస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఇండ‌స్ట్రీలో న‌న్ను చూసే ప‌ద్ద‌తి కూడా మారింది. ఇప్పుడు నా కెరీర్ తో ఎంతో సంతోషంగా ఉన్నాను. ఏదో సాధించిన సంతోషం క‌లుగుతుంది. ఓ న‌టిగా ఇంత‌కంటే నాకు ఏం కావాలి అనిపిస్తుంది` అని అన్నారు. సునీత హిస్, బుద్ మ‌ర్ గ‌యా, స్త్రీ, బాలా, శుభ్ మంగ‌ళ్ జ్యాద్ సావ‌న్ లాంటి చిత్రాల్లో న‌టించారు. కొన్ని వెబ్ సిరీస్ లు కూడా చేసారు.

Tags:    

Similar News