స‌న్నిలియోన్ తో అలాంటి పనులు కుద‌ర‌వ‌ని చెబుతా!

ఈ నేప‌థ్యంలో తాజాగా న‌టి స‌న్నిలియోన్ కూడా హేమ క‌మిటీ నివేదిక‌పై స్పందించింది.

Update: 2024-09-09 11:30 GMT

మ‌ల‌యాళం ఇండ‌స్ట్రీని హేమ క‌మిటీ నివేదిక ఏ రేంజ్ లో అల్లాడిస్తుందో తెలిసిందే. హేమ క‌మిటీ దెబ్బ‌కి మిగ‌తా ప‌రిశ్ర‌మ‌ల్లో సైతం అంలాంటి క‌మిటీలు రావాలి అన్న డిమాండ్ మొద‌లైంది. ఇప్ప‌టికే కోలీవుడ్ ముందుకొచ్చి ఓ క‌మిటీ వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. బాధితులు ఎవ‌రైనా త‌మ ముందుకొచ్చి త‌మ‌కలాంటి అనుభ‌వాలు ఎదురైతే వెంట‌నే చెప్పాల‌ని కోరింది. త‌క్ష‌ణ ప‌రిష్కారం చేస్తామ‌ని భ‌రోసా క‌ల్పించింది.

టాలీవుడ్ లో కూడా ఇలాంటి క‌మిటీ రావాలని స‌మంత కోరిన సంగ‌తి తెలిసిందే. అలాగే 2019 లో వేసిన క‌మిటీ నివేదిక‌ను ప్ర‌భుత్వం విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేసింది.ఇంకా చాలా మంది న‌టీమ‌ణులు ఈ దాడుల‌పై తమ అభిప్రాయాల్ని ఎంతో ఓపెన్ గా పంచుకున్నారు. ఇలాంటి విష‌యాల్ని చూసి చూడ‌న‌ట్లు వ‌ద‌ల‌కూడ‌ద‌ని కామాంధాల్ని క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేసారు.

బాధిత మ‌హిళ‌లంతా మీడియా ముందుకొచ్చి జ‌రిగిన అన్యాయం గురించి చెప్పుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తాజాగా న‌టి స‌న్నిలియోన్ కూడా హేమ క‌మిటీ నివేదిక‌పై స్పందించింది. ప్రస్తుతం ప్రభుదేవాతో కలిసి ఓ సినిమా చేస్తోంది స‌న్నిలియోన్. ఈ సినిమా ప్ర‌మోష‌న్ లో భాగంగానే ఈ నివేదిక‌పై స్పందించింది. 'సినిమాల్లో నాకు అలాంటి చేదు అనుభవాలు ఇంత‌వ‌ర‌కూ ఎదుర‌వ్వ‌లేదు. ఒక్క అవకాశం మిస్ అయితే మరో వంద అవకాశాలు వస్తాయి.

ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే వద్దు అని చెప్పి వెళ్ళిపోతాను. ఇతరులతో పంచుకునేంత చేదు అనుభవాలు నాకు లేవు . నేను వ్యక్తిత్వం, వృత్తిని నమ్ముతాను. పారితోషికం త‌క్కువ‌ అని నేను భావించినప్పుడు నేను డిమాండ్ చేస్తా. అందరూ అలాగే చేయాలన్నది నా అభిప్రాయం. సరైన నిర్ణయాలను ఎంచుకోండి. ఏదైనా తప్పు లేదా తప్పుడు ప్రవర్తన అని మీకు అనిపిస్తే, మీరు వద్దు అని చెప్పి వెళ్లిపోవాలి. దాంతో ఒక్క అవకాశం మిస్ అవ్వొచ్చు.. కానీ ఒక్క అవకాశం పోతే వందల కొద్దీ అవకాశాలు వస్తాయి' అని తెలిపింది.

Tags:    

Similar News