స‌న్నీలియోన్‌కి మళ్లీ పెళ్లి.. కార‌ణం తెలిస్తే షాక్!

సన్నీ- డేనియల్ సాంప్రదాయ ఆనంద్ కరాజ్ వేడుకలో వివాహం చేసుకున్న 13 సంవత్సరాల తర్వాత మ‌రోసారి ఈ పెళ్లి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

Update: 2024-11-04 17:40 GMT

మాజీ శృంగార తార‌ స‌న్నీలియోన్ బాలీవుడ్‌లో ద‌శాబ్ధ కాలం ఏలింది. నార్త్ - సౌత్ రెండు చోట్లా ఐట‌మ్ భామ‌గాను ఒక ఊపు ఊపింది. ఇటు సౌత్ లోను ఈ భామ స్పెష‌ల్ నంబ‌ర్లతో పాటు అతిథి పాత్ర‌లు చేసింది. మంచు మ‌నోజ్ క‌రెంటు తీగ చిత్రంలోను న‌టించింది. స‌న్నీ అడ‌ల్ట్ ఇండ‌స్ట్రీ స‌హ‌చ‌రుడు అయిన డేనియ‌ల్ వెబ‌ర్ ని పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే.

 

సన్నీ లియోన్ 2011లో డేనియల్ వెబర్‌ను వివాహం చేసుకుంది. ఆ త‌ర్వాత ఈ జంట అన్యోన్య దాంప‌త్యం, వారి స‌రోగ‌సీ పిల్ల‌లు, ద‌త్త పుత్రిక‌ల‌తో క‌లిసి ఆనంద‌మ‌య జీవితాన్ని సాగించ‌డం తెలిసిన‌దే. 13 సంవత్సరాల తర్వాత భర్త డేనియల్ వెబర్ ను స‌న్నీలియోన్ మ‌రోసారి వివాహం చేసుకుంది. అక్టోబర్ 31న మాల్దీవులలో తన భర్తతో వివాహ ప్రమాణాలను పునరుద్ధరించుకుంది. టైమ్స్ ఆఫ్ ఇండియాలోని ఒక క‌థ‌నం ప్రకారం.. కుమార్తె నిషా సన్నీ.. కొడుకులు నోహ్, ఆషర్ తమ తండ్రితో కలిసి ఆమె కోసం వేచి చూస్తుండ‌గా.. స‌న్నీ అక్క‌డికి వ‌స్తుంది. డేనియల్ ఒక‌ కొత్త పెళ్లి ఉంగరంతో స‌న్నీకి స‌ర్ ప్రైజ్ ఇచ్చాడు. ఈ దృశ్యానికి సంబంధించిన ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.

 

ఈ జంట సోషల్ మీడియాలో ఫోటోల‌ను షేర్ చేయ‌క‌పోయినా కొన్ని ఫోటోలు వెబ్ లో లీక‌య్యాయి. వారి పిల్లలు - నిషా, నోహ్, ఆషెర్ స‌మ‌క్షంలో ఇది మ‌ళ్లీ పెళ్లి అని గుస‌గుస వినిపిస్తోంది. సన్నీ- డేనియల్ సాంప్రదాయ ఆనంద్ కరాజ్ వేడుకలో వివాహం చేసుకున్న 13 సంవత్సరాల తర్వాత మ‌రోసారి ఈ పెళ్లి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అయితే ఈ పెళ్లి వెన‌క చాలా ఆస‌క్తిక‌ర విష‌యం ఉంది. ఇద్దరూ తమ వివాహ ప్రమాణాలను చాలా కాలంగా పునరుద్ధరించాలని భావిస్తున్నారు. అయితే వారి పిల్లలు ఘ‌న‌మైన పెళ్లి వేడుక ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలని వారు కోరుకున్నారని కూడా క‌థ‌నాలు వ‌చ్చాయి. కుటుంబ సభ్యులకు ఇష్టమైన విహారయాత్ర స్థ‌లం కాబట్టి వారు దీన్ని మాల్దీవుల్లో ప్లాన్ చేసారని తెలుస్తోంది.

 

దంపతులు స్వయంగా రాసుకున్న పెళ్లి ప్రమాణాలను చదివి వినిపించారని, ముగ్గురు పిల్లలలో ప్రతి ఒక్కరు కుటుంబం అంటే ఏమిటో చెప్పారని కూడా జాతీయ మీడియా క‌థ‌నం పేర్కొంది. కుమార్తె నిషా మామ్ సన్నీని అక్క‌డ అంద‌మైన‌ బాట‌లో నడిపించింది.. కొడుకులు తమ తండ్రితో కలిసి వేదికపై వేచి ఉన్నారు. అంతే కాదు.. సన్నీని కొత్త వెడ్డింగ్ రింగ్‌తో సర్ ప్రైజ్ చేయడం ద్వారా డేనియల్ వేడుకను మరింత ప్రత్యేకంగా మార్చాడు.

సన్నీ లియోన్- డేనియ‌ల్ కొంతకాలం డేటింగ్ తర్వాత 9ఏప్రిల్ 2011న వివాహం చేసుకున్నారు. సన్నీ సిక్కు మూలాలను గౌరవించే సాంప్రదాయ ఆనంద్ కరాజ్ వేడుకలో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. స‌న్నీలియోన్ అసలు పేరు కరేంజీత్ కౌర్. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో వారి 13వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆనంద్ కరాజ్ వేడుక నుండి ఒక త్రోబాక్ ఫోటోను స‌న్నీ షేర్ చేసింది.

Tags:    

Similar News