సూపర్‌మేన్ కి తోక కట్.. కారణం ఇదే
అయితే ఈసారి వచ్చే సూపర్‌మేన్ సినిమా చాలా విభిన్నంగా ఉంటుందని, లుక్ కూడా విభిన్నంగా ఉండబోతున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు.
హాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎన్నో సూపర్‌మేన్ కాన్సెప్ట్ సినిమాలు వచ్చిన విషయం తెల్సిందే. సూపర్‌మేన్ అనగానే హాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులకు ఒక రూపం కళ్లలో మెదులుతూ ఉంటుంది. అయితే ఈసారి వచ్చే సూపర్‌మేన్ సినిమా చాలా విభిన్నంగా ఉంటుందని, లుక్ కూడా విభిన్నంగా ఉండబోతున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు.
జేమ్స్ గన్ దర్శకత్వంలో కొత్త సూపర్‌మేన్ రాబోతుంది. ఇటీవల సోషల్ మీడియా ద్వారా జేమ్స్ గన్ స్పందిస్తూ... కథ రాసుకున్నది మొదలుకుని షూటింగ్ పూర్తి అయ్యే వరకు కూడా టైటిల్ గా సూపర్ మేన్ : లెగసీ టైటిల్ అనుకున్నాం. కానీ ఇప్పుడు మాత్రం టైటిల్ తోక కట్ చేసి జస్ట్ సూపర్‌మేన్ గా విడుదల చేయబోతున్నాం.. సినిమాకు జస్ట్ సూపర్ మేన్ అయితేనే బాగుంటుందని, క్యాప్షన్ గా లెగసీ ఉండాల్సిన అవసరం లేదు అనుకుంటున్నట్లుగా పేర్కొన్నారు.
వచ్చే ఏడాది జులై 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సూపర్‌మేన్ సినిమాలో హీరోగా డేవిడ్ కోరెన్స్వెట్ నటిస్తున్నాడు. గతంలో వచ్చిన సూపర్‌మేన్ సిరీస్ ల్లో హెన్రీ కవిల్ నటించి మెప్పించాడు. అయితే ఈసారి నటిస్తున్న డేవిడ్ కోరెన్స్వెట్ వయసు కేవలం 30 ఏళ్లు మాత్రమే అవ్వడంతో ఎలాంటి యాక్షన్ సీన్స్ ఉంటాయా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
గతంలో వచ్చిన సూపర్‌మేన్ సిరీస్ లకు ఏమాత్రం తగ్గకుండా ఈ సిరీస్ ను దర్శకుడు జేమ్స్ గన్ రూపొందిస్తున్నట్లుగా చెబుతున్నాడు. అయితే సూపర్ మేన్ ను ఈసారి విభిన్నంగా చూపించడంతో పాటు అంతా కూడా ఆశ్చర్యపోయే విధంగా చూపించబోతున్నట్లుగా పేర్కొన్నాడు.