వ‌ర్మ‌తో ఫోటో దిగితే ఒక‌డు యూట్యూబ్ లో ఏపిసోడ్ చేసేసాడు!

అవును ఈ విష‌యాన్ని స్వ‌యంగా సురేఖ వాణి తెలిపింది. ఆ సంగ‌తి ఆమె మాట‌ల్లోనే తెలుసుకుందాం.

Update: 2024-03-13 12:04 GMT

సంచ‌ల‌నాల రాంగోపాల్ వ‌ర్మ‌తో ఎంతో మంది ఫోటోలు దిగుతుంటారు. ఆయ‌న్ని అభిమానించే న‌టుల దగ్గ‌ర నుంచి సాధార‌ణ అభిమానుల వ‌ర‌కూ అంతా ఫోటోలు...సెల్పీలు దిగుతుంటారు. అందులో ఎంతో మంది లేడీ ఫాలోవ‌ర్స్ కూడా ఉంటారు. కానీ వాళ్లెవ్వ‌రితోనూ యూ ట్యూబ్ లో ఎవ‌రూ ఎలాంటి ఎపిసోడ్లు గానీ....షార్ట్ ఫిల్మ్ లు గానీ ఎప్పుడూ తీయ‌లేదు. కానీ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ సురేఖ -వ‌ర్మ‌తో ఫోటో దిగే స‌రికి ఒక‌రు ఏకంగా వాళ్లిద్ద‌ర్ని ప్ర‌ధాన పాత్ర‌ధారుల్ని చేసి ఓ ఎపిసోడ్ చేసేసాడుట‌.

అవును ఈ విష‌యాన్ని స్వ‌యంగా సురేఖ వాణి తెలిపింది. ఆ సంగ‌తి ఆమె మాట‌ల్లోనే తెలుసుకుందాం. `నేను మా అమ్మాయితో కలిసి బయటికి వెళ్లినా .. మా ఇద్దరికీ సంబంధించి ఏ పోస్ట్ పెట్టినా కొంతమంది ర‌క‌ర‌కాలుగా రియాక్ట్ అవుతుంటారు. భ‌ర్త పోయిన త‌ర్వాత విచ్చలవిడి త‌నం వ‌చ్చేసింద‌ని ఇష్టారీతిన కామెంట్లు చేస్తారు. భర్తలేని ఒక స్త్రీని చూసే దృష్టి కోణం ఇలా ఉంటుంది. సమాజంలో ఇలాంటివాళ్లు ఇంకా ఉన్నారా? అనిపిస్తుంది.

ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్లు స్పందిస్తూనే ఉంటారు. సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన కొత్తలో బాధపడేదానిని. కానీ ఆ తరువాత అల‌వాటుగా మార‌డంతో కామెంట్ల‌ను ప‌ట్టించుకోవ‌డం మానేసాను. ఎంత మంది నోళ్ల‌ను మూయించ‌గ‌లం. ఓ ప‌దిమంది అయితే ప‌ర్వాలేదు...ఎంతో మంది ర‌క‌ర‌కాల కామెంట్ల‌తో విసుగు పుట్టిస్తే అంద‌రికీ స‌మాధానం చెప్ప‌లేం క‌దా. మా వాళ్లకు కూడా కామెంట్స్ చూడొద్ద‌ని చెప్పా.

ఒకసారి రాంగోపాల్ వర్మగారితో కలిసి ఓ ఫోటో దిగాను. ఓ అభిమానిగా చేసిన ప‌ని అది. దానిపై ఒకడు ఏకంగా యూ ట్యూబ్ లో ఒక ఎపిసోడ్ చేసేసాడు. అలాంటివారిని చూసినప్పుడు ఇంతమంది ప‌నిలే కుండా ఖాళీగా ఉంటున్నారా? అనిపిస్తుంది. వాళ్లంతా నా వలన డబ్బులు సంపాదించు కుంటున్నారు. ఈ విధంగానైనా ఓ నలుగురికి భోజనం పెడుతున్నాను అనే అనుకుంటాను` అని అన్నారు.

Tags:    

Similar News