సింగంతో సింహం.. ఆహా ప్లాన్ అదుర్స్..!

వెండితెర మీద రికార్డులు కొట్టడమే కాదు ఓటీటీ టాక్ షోతో కూడా అదిరిపోయే రికార్డులు కొట్టగలడు అని నిరూపించాడు మన నందమూరి సింహం బాలకృష్ణ

Update: 2024-10-24 07:26 GMT

వెండితెర మీద రికార్డులు కొట్టడమే కాదు ఓటీటీ టాక్ షోతో కూడా అదిరిపోయే రికార్డులు కొట్టగలడు అని నిరూపించాడు మన నందమూరి సింహం బాలకృష్ణ. ఆయన చేస్తున్న సినిమాలు ఫ్యాన్స్ ని ఎలా ఖుషి అయ్యేలా చేస్తాయో దానికి మించి అన్ స్టాపబుల్ షో ఎక్కువ ఎంటర్టైన్ చేస్తుంది. అసలు బాలకృష్ణతో ఈ టాక్ షో చేయాలన్న ఆహా వారి ఆలోచన నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఆహా ని అందలం ఎక్కించేసిన అన్ స్టాపబుల్ షో సక్సెస్ ఫుల్ గా 3 సీజన్లు పూర్తి చేసుకోగా ఇప్పుడు అన్ స్టాపబుల్ సీజన్ 4 మొదలు కాబోతుంది.

ఆహా ఓటీటీ.. ఇది తెలుగు వారి ఓటీటీ అనే రేంజ్ లో స్టార్ సినిమాల నుంచి చిన్న సినిమాల వరకు డిజిటల్ రిలీజ్ చేస్తూ అన్ స్టాపబుల్ లాంటి షోస్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే ఆహా నుంచి ఏ షో వచ్చిన ఆడియన్స్ కూడా ఆహా సూపర్ అనాల్సిందే. ఇక అన్ స్టాపబుల్ సీజన్ 4 విషయానికి వస్తే ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో మొదలు పెట్టారు. బాలయ్య, బాబు గారి అన్ స్టాపబుల్ చిట్ చాట్ ప్రోమో ఇప్పటికే రిలీజై సెన్సేషన్ సృష్టిస్తుంది.

ఇక అన్ స్టాపబుల్ సీజన్ 4 సెకండ్ ఎపిసోడ్ గా కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన కంగువ టీం తో స్పెషల్ చిట్ చాట్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. తమిళ హీరోనే అయినా సరే తెలుగు ఆడియన్స్ కు సూర్య సుపరిచితుడే.. ఆయన చేసిన ఎన్నో సినిమా తెలుగులో డబ్ అయ్యి మంచి సక్సెస్ అందుకున్నాయి. నవంబర్ 14న రిలీజ్ అవుతున్న కంగువ ప్రమోషన్స్ లో భాగంగా అన్ స్టాపబుల్ షో తో తెలుగు ప్రమోషన్స్ మొదలు పెట్టారు కంగువ టీం.

సింగంగా ఆడియన్స్ ని అలరించిన సూర్య మన నందమూరి సింహంతో స్పెషల్ చిట్ చాట్ లో పాల్గొన్నాడు. ఆహా అన్ స్టాపబుల్ సీజన్ 4 లో కంగువ టీం హంగామా చేయనుంది. సూర్య, బాబీ డియో, కంగువ డైరెక్టర్ శివ కూడా ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నారని తెలుస్తుంది. మరి బాలయ్య షోతో ప్రమోషన్స్ మొదలు పెట్టారు కాబట్టి కంగువకు భారీ మైలేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆహా కూడా అన్ స్టాపబుల్ 4 ని పాన్ ఇండియా సెలబ్రిటీస్ తో క్రేజీ ఇంటర్వ్యూస్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో ముందుండే ఆహా మునుముందు మరిన్ని నెక్స్ట్ లెవెల్ ప్లాన్స్ తో రాబోతున్నారని తెలుస్తుంది.

Tags:    

Similar News