ఆ హీరో కోసం వాళ్లిద్దరి మధ్య పోటీ!
సూర్య 45వ చిత్రం ఇప్పటికే లాక్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో నటుడు ఆర్.జె బాలాజీ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు
సూర్య 45వ చిత్రం ఇప్పటికే లాక్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో నటుడు ఆర్.జె బాలాజీ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఆధ్యాత్మిక అంశాలతో నిండిన ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. ప్రస్తుతం మేకర్స్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఓ కీలక పాత్ర కోసం కశ్మరీ పరదేశీని తీసుకున్నారు. అయితే సూర్యకి హీరోయిన్ ఎవరు? అన్నది మాత్రం ఇంతవరకూ ఖరారు కాలేదు. ఈ నేపథ్యంలో మృణాళ్ ఠాకూర్, రుక్మిణి వసంత్ పేర్లు తెరపైకి వచ్చాయి.
వీళ్లిద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వాళ్లలో ఒకర్నే ఎంపిక చేయనున్నారు. ఈ నేపత్యంలో వాళ్ల ట్రాక్ రికార్డు పరిశీస్తున్నారు. రుక్మిణి ఇప్పటికే కోలీవుడ్ లో రెండు సినిమాలు చేసింది. కన్నడలో ఆమెకి మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన నటి. నేచురల్ పెర్మార్మర్ గామంచి గుర్తింపు ఉంది. ఇక మృణాల్ కి `సీతారా మం`తో మంచి పేరొచ్చింది. తెలుగులో బాగా ఫేమస్ నటి. కానీ తమిళ్ లో మాత్రం ఇంత వరకూ సినిమాలు చేయలేదు.
అలాగే సౌత్ లో ఇతర భాషల్లోనూ ఆమె పనిచేయలేదు. దీంతో ఇద్దరి మధ్య పోటీ ఏర్పడింది. ఈ ప్రాజెక్ట్ కి ఎవరు ఎంపిక అవుతారు? అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రయత్నాలు మాత్రం ఎవరికి వారు చేస్తున్నారు. సూర్య లాంటి స్టార్ హీరోతో ఛాన్స్ అంటే చిన్న విషయం కాదు. ఆయన సరసన నటించడానికి ఎంతో మంది భామలు క్యూలో ఉన్నారు. కానీ ఇప్పుడా ఛాన్స్ రుక్మిణి, మృణాల్ కళ్ల ముందుంది. ఈ నేపథ్యంలో ఎవరు ఎంపికైనా వాళ్లు లక్కీ గాళ్.
రుక్మిణ తమిళ్, తెలుగులో కొన్ని సినిమాలు కమిట్ అయింది. అవి సెట్స్ లో ఉన్నాయి. అయితే మృణాల్ మాత్రం హిందీ సినిమాలు తప్ప సౌత్ లో ఏ ప్రాజెక్ట్ చేయలేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో ఐదు సినిమాలు చేస్తోంది. అవన్నీ కూడా ఆన్ సె ట్స్ లో ఉన్న చిత్రాలే.