ట్రైలర్: సూర్య అతి భయాంకర 'కంగువ'
కంగువ చిత్రం అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా 10కి పైగా భాషల్లో విడుదల కానుంది. ఇక తాజాగా విడుదలైన ఈ చిత్రం ట్రైలర్, ప్రేక్షకులకు కొత్త రకం అనుభూతిని అందించనుంది.
కోలీవుడ్ స్టార్ సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ "కంగువ" ఫస్ట్ లుక్ తోనే ఆడియెన్స్ లో ఒక మంచి వైబ్ క్రియేట్ చేసింది. మరోసారి సూర్య ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాడు అనేలా జనాల్లో ఆసక్తి పెరిగింది. ఇక ఫైనల్ గా సినిమా ట్రైలర్ విడుదలైంది. బ్లాక్‌బస్టర్ చిత్రాల దర్శకుడు శివ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాను తమిళ సంస్కృతి గుండెల్లో నిలిపే విధంగా, ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులకు చేరవేయాలని దర్శకుడు శివ తన టీమ్‌తో కలసి రూపొందిస్తున్నారు.
పునర్జన్మ నేపథ్యంతో సాగే ఈ చిత్రం సూర్య కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్ గా నిలవనుంది. ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకున్నాయి. సరికొత్తగా డిజైన్ చేసిన ట్రైలర్ దృష్టిని మరింతగా ఆకర్షించింది. కంగువ చిత్రం అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా 10కి పైగా భాషల్లో విడుదల కానుంది. ఇక తాజాగా విడుదలైన ఈ చిత్రం ట్రైలర్, ప్రేక్షకులకు కొత్త రకం అనుభూతిని అందించనుంది.
ట్రైలర్ ప్రారంభం లొ ఎప్పుడో పూర్వ కాలంలో ఉన్న ఒక ద్వీపంకు చెందిన పలు గిరిజన తెగల బ్యాక్ డ్రాప్ ను హైలెట్ చేశారు. అంతుచిక్కని రహాస్యంలో వారి మధ్య సాగుతున్న సంఘర్షణలను కథలో కీలకం కాబోతున్నట్లు తెలుస్తోంది. సూర్య మరియు బాబీ డియోల్ మధ్య డైరెక్ట్‌గా సాగే యుద్ధం మరో మెయిన్ హైలెట్. సూర్య తన శక్తివంతమైన నటనతో కంగువ పాత్రలో మెరిసిపోతుండగా, బాబీ డియోల్ భయంకరమైన ప్రతినాయకుడిగా కనిపిస్తున్నాడు.
ఇక మరోవైపు బ్రిటిష్ దళాలు కూడా చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. బానిసత్వం చెల్లదు అంటూ హీరో ప్రజలకు ఒక నాయకుడిలా ఉన్నాడు. ఈ ట్రైలర్ లో భయంకరమైన అడవుల నుండి ఉత్కంఠభరిత వాతావరణం కన్పిస్తుంది. ట్రైలర్ లోని యుద్ధ సన్నివేశాలు, విఎఫ్ఎక్స్, అద్భుత విజువల్స్, సినిమాలోని గ్రాండ్ ఎమోషన్స్ గురించి చెప్పకనే చెప్పాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ట్రైలర్‌కి మరింత ఉత్కంఠను పెంచింది.
ఇది మొత్తం సినిమా ప్రేక్షకులను ఓ అద్భుత అనుభవంలోకి నడిపించనుందని ట్రైలర్ స్పష్టం చేసింది. స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్ నిర్మాణ విలువలు ప్రతీ ఫ్రేమ్‌లో మెరుగ్గా కనిపిస్తున్నాయి. నైజాం ఏరియాలో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. UV క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్‌తో కలిసి ఈ సినిమాను నిర్మించింది. ఈ చిత్రంలో సూర్య, దిశా పటానీ, బాబీ డియోల్, నట్టి నటరాజ్, జగపతి బాబు, యోగి బాబు తదితరులు నటిస్తున్నారు.