భార్య పిల్ల‌ల కోసం ముంబైలో సౌత్ హీరో 70కోట్ల పెట్టుబ‌డి!

గత కొన్ని నెలలుగా సూర్య పూర్తిగా ముంబైకి వెళ్లి అక్కడ నుండి ఆపరేషన్ చేస్తున్నాడని పుకార్లు వినిపిస్తున్నాయి.

Update: 2024-07-27 07:13 GMT
భార్య పిల్ల‌ల కోసం ముంబైలో సౌత్ హీరో 70కోట్ల పెట్టుబ‌డి!
  • whatsapp icon

సౌతిండియాలో జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా గొప్ప క్రేజ్‌ని, ఫాలోయింగ్‌ని ఆస్వాధిస్తూ భారీ పారితోషికాలు అందుకుంటున్న హీరోగా త‌మిళ స్టార్ హీరో సూర్య‌కు పేరుంది. `ఆకాశం నీ హ‌ద్దురా` లాంటి స్ఫూర్తివంత‌మైన సినిమాతో అతడు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు. విక్ర‌మ్ - రాకెట్రీ-స‌ర్ఫిరా లాంటి చిత్రాల్లో అతిథి పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకున్నాడు. అలాగే జైభీమ్ లో బ‌డుగుబ‌ల‌హీన వ‌ర్గాల‌ను ఆదుకునే లాయ‌ర్ గా అద్భుతంగా న‌టించి మెప్పించాడు. ఈ నాలుగైదేళ్ల‌లో సూర్య కెరీర్ ఆస‌క్తిక‌రంగా సాగింది. ప్ర‌స్తుతం అత‌డు పాన్ ఇండియా మార్కెట్ కోసం త‌పిస్తున్నాడు. అత‌డి ప్ర‌ణాళిక‌లు ఆ దిశ‌గా సాగుతున్నాయి.


గత కొన్ని నెలలుగా సూర్య పూర్తిగా ముంబైకి వెళ్లి అక్కడ నుండి ఆపరేషన్ చేస్తున్నాడని పుకార్లు వినిపిస్తున్నాయి. అందుకు కారణం ఆస‌క్తిక‌రం. భార్య జ్యోతిక ఇటీవ‌ల‌ చాలా హిందీ సినిమాల్లో నటిస్తూ కెరీర్ ప‌రంగా ముంబైలోనే బిజీగా ఉన్నారు. అలాగే సూర్య పిల్లలు ముంబైలో చదువుతున్నారు. పిల్ల‌ల చ‌దువుల కార‌ణంగా జ్యోతిక హిందీ సినిమాల‌ను ఎంపిక చేసుకుంటున్నార‌ట‌. జ్యోతిక‌ ముంబైలో ఉండటానికి పిల్ల‌లే ప్ర‌ధాన‌ కారణం. ఇప్పుడు భార్య పిల్ల‌ల కోసం సూర్య ఇటీవ‌ల ఏకంగా 70 కోట్ల విలువైన బంగ్లాను కొన్నార‌ని క‌థ‌నాలొస్తున్నాయి.

అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక నిర్ధారణ లేకపోయినా ఈ వార్త త‌మిళ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సూర్య త‌దుప‌రి వ‌రుస పాన్ ఇండియా సినిమాల్లో న‌టిస్తున్నాడు. అత‌డు హిందీలోను త‌న మార్కెట్ రేంజును పెంచుకోవాల‌ని క‌ల‌లుగంటున్నాడు. దీనివ‌ల్ల కూడా అక్క‌డ యాక్టివిటీస్ షురూ చేసాడ‌ని భావిస్తున్నారు.

అయితే బంగ్లా కొనుగోలు వార్తలను సూర్య కానీ, అతని భార్య జ్యోతిక కానీ ధృవీకరించలేదు. వారి నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. అయితే ఈ కుటుంబ‌ క‌థ‌లో ఒక అద్భుత‌మైన‌ నీతి దాగి ఉంది. పిల్ల‌ల కోసం త‌ల్లి.. భార్య పిల్ల‌ల కోసం ఇంటి పెద్ద ముంబై గూటికి చేరుకున్నార‌ని విశ్లేషించాలి. ఇది అంద‌రికీ స్ఫూర్తిదాయ‌కం.

సూర్య తదుపరి `కంగువ`లో న‌టిస్తున్నాడు. ద‌రువు శివ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఇందులో బాబీ డియోల్ నెగిటివ్ రోల్‌లో న‌టిస్తున్నాడు. ఇప్ప‌టికే పోస్ట‌ర్లు, వీడియోల‌కు అద్బుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఈ సినిమాని కేవ‌లం భార‌తీయ భాష‌ల్లోనే కాకుండా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లు భాష‌ల్లో విడుద‌ల చేసేందుకు చిత్ర‌బృందం స‌న్నాహ‌కాల్లో ఉంది.

Tags:    

Similar News