SVC58: హ్యాట్రిక్ కొట్టేలా సిద్ధమైన హిట్ కాంబో
హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ఈ సినిమా పూజా కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేయగా, గీతా ఆర్ట్స్ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ బోర్డ్ పట్టారు.
విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వెంకటేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పించనుండగా, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ కొత్త చిత్రం హ్యాట్రిక్ హిట్ అవుతుందనే మేకర్స్ ఇప్పటికే పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యేలా అప్డేట్స్ ఇచ్చారు. ఇప్పటికే "ఎఫ్2" మరియు "ఎఫ్3" చిత్రాలతో భారీ విజయాలు అందుకున్న వీరి కాంబినేషన్, ఇప్పుడు మూడవ చిత్రంతో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ఈ సినిమా పూజా కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేయగా, గీతా ఆర్ట్స్ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ బోర్డ్ పట్టారు. వంశీ పైడిపల్లి స్క్రిప్ట్‌ను అందించగా, రాఘవేంద్ర రావు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైయాంగులర్ క్రైమ్ ఎంటర్టైనర్‌గా రూపుదిద్దుకోనుంది. వెంకటేష్‌తో పాటు మీనాక్షి చౌదరి మరియు ఐశ్వర్య రాజేష్ కీలక పాత్రల్లో నటించనున్నారు.
ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక నిపుణుల బృందం కూడా ప్రత్యేకమైన అనుభూతిని అందించేందుకు సిద్ధమైంది. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరిలియో, సినిమాటోగ్రాఫర్ సమీర్ రెడ్డి, ప్రొడక్షన్ డిజైనర్ ఎస్. ప్రకాశ్, ఎడిటర్ తమ్మిరాజు, సహ రచయితలు ఎస్. కృష్ణ మరియు జి. అధినారాయణ, యాక్షన్ డైరెక్టర్ వి. వెంకట్ లు ఈ చిత్రానికి పనిచేయనున్నారు.
ముఖ్యంగా ఈ సినిమా కథలో మూడు ప్రధాన పాత్రల మధ్య ఆసక్తికరంగా నడిచే కథనంతో రూపొందించబడుతుంది. ప్రోటగనిస్ట్, అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, మరియు అతని భార్య మధ్య జరిగే సంఘర్షణలు, ప్రేమ, ద్వేషం, నమ్మకం, పగ వంటి అంశాలతో నిండిన కథాంశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలుస్తోంది. ఈ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించినప్పటి నుండి, వెంకటేష్ అభిమానులు మరియు సినిమా ప్రియులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
అనిల్ రావిపూడి తన దర్శకత్వంలో కామెడీ మరియు ఎమోషన్ మేళవించి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో నిపుణుడు. ఈ ప్రాజెక్ట్ విషయంలో కూడా అదే పద్ధతిని కొనసాగించనున్నారు. ఎఫ్2, ఎఫ్3 వంటి చిత్రాల విజయాలు, ఈ సినిమా పై అంచనాలను మరింత పెంచుతున్నాయి. ఈ చిత్రంతో మరోసారి హ్యాట్రిక్ హిట్ సాధించాలని నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి, మరియు హీరో వెంకటేష్ స్ట్రాంగా రెడీ అవుతున్నారు. ఇక సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కి లేదా ఆ తరువాత సమ్మర్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.