'స్వాగ్' మెలోడి.. విష్ణు, మీరా అలా..

ఇప్పుడు స్వాగ్ సినిమాతో త్వరలో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు శ్రీవిష్ణు.

Update: 2024-09-27 14:25 GMT

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు.. వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. వైవిధ్యమైన కాన్సెప్టులు ఎంచుకుంటూ తెలుగు ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. తన యాక్టింగ్ తో మెప్పిస్తున్నారు. సినిమా సినిమాకు తనలోని మరింత టాలెంట్ ను బయటపెడుతున్నారు. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. నాన్ స్టాప్ గా మూవీ షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఇప్పుడు స్వాగ్ సినిమాతో త్వరలో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు శ్రీవిష్ణు.

ప్రముఖ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్ గా నిర్మిస్తుండగా.. యంగ్ డైరెక్టర్ హసిత్ గోలి తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే శ్రీవిష్ణు, హసిత్ కాంబోలో వచ్చిన రాజ రాజ చోర మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అందుకే ఇప్పుడు స్వాగ్ మూవీపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ ద్వారా శ్రీవిష్ణు.. స్వాగ్ తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంటారని అంతా అంచనా వేస్తున్నారు.

ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ మేకర్స్.. ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. ఇప్పటికే వివిధ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా.. అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. టీజర్ అయితే వేరే లెవల్ లో ఆకట్టుకుంది. శ్రీవిష్ణు ను డిఫరెంట్ క్యారెక్టర్స్ లో చూసి మూవీ లవర్స్ ఫిదా అయ్యారు. అదే సమయంలో మేకర్స్.. వరుసగా సాంగ్స్ ను విడుదల చేసి సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన సింగరో సింగ, గువ్వ గూటి, ఇంగ్లాండ్ రాణి సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.

ఇప్పుడు అదే జోష్ తో ఫోర్త్ సింగిల్ బ్యూటీఫుల్ మెలోడియస్ సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. 'నీలో నాలో కదలాడు భావమే రాగం.. లోలో ఎదలో వినిపించ..' అంటూ సాగుతున్న పాట.. మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటుంది. వింటేజ్ తెలుగు సాంగ్స్ ను గుర్తు చేస్తుంది. ఎవరైనా ఫిదా అయ్యేలా వివేక్ సాగర్ మ్యూజిక్ అందించగా.. రాజేష్ కృష్ణన్, అంజనా సౌమ్య తమ గాత్రంతో ప్రాణం పోశారు. సీనియర్ లిరిసిస్ట్ భువనచంద్ర అందించిన లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి.

అయితే శ్రీ విష్ణు, మీరా జాస్మిన్ మధ్య సాగిన ఆ పాట.. ఫుల్ ట్రెండ్ అవుతూ.. మోస్ట్ ఫేవరేట్ గా మారేటట్లు కనిపిస్తోంది. ఇద్దరూ 80స్, 90స్ టైమ్ గెటప్స్ లో.. ఓ సైకిల్ పై షికారుకు వెళ్తున్న క్యూట్ విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. షూటింగ్ బిట్స్ ను కూడా మేకర్స్ యాడ్ చేశారు. ఓవరాల్ గా స్వాగ్ నుంచి వచ్చిన కొత్త సాంగ్.. మంచి రెస్పాన్స్ అందుకుని నెట్టింట దూసుకుపోతోంది. మరి అక్టోబర్ 4వ తేదీన రిలీజ్ కానున్న స్వాగ్ చిత్రం ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.

Full View
Tags:    

Similar News