ఆయనకు నాకు చాలా పోలికలు ఉన్నాయి : తాప్సి
హిందీ ప్రేక్షకులు మాత్రమే కాకుండా అన్ని ఇండియన్ భాషల సినీ ప్రేక్షకుల కూడా షారుఖ్ ఖాన్ ను అభిమానిస్తూ ఉంటారు.
హిందీ ప్రేక్షకులు మాత్రమే కాకుండా అన్ని ఇండియన్ భాషల సినీ ప్రేక్షకుల కూడా షారుఖ్ ఖాన్ ను అభిమానిస్తూ ఉంటారు. ఆయన అంటే సాధారణ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా సినిమా స్టార్స్ కి మరియు సెలబ్రిటీలకు కూడా ఎంతో ఇష్టం అని మరోసారి నిరూపితం అయ్యింది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తాప్సి తనకు షారుఖ్ ఖాన్ పై ఉన్న అభిమానంను చాటుకుంది. ముద్దుగుమ్మ తాప్సి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు షారుఖ్ ఖాన్ కి చాలా విషయాల్లో పోలికలు ఉన్నాయని, ఇద్దరి ఆలోచనలు అభిరుచులు ఒకటే అన్నట్లుగా చెప్పుకొచ్చింది.
తాప్సి ఇంకా మాట్లాడుతూ... ప్రపంచంలో ఎంతో మందిలాగానే నేను కూడా షారుఖ్ ఖాన్ కి అభిమానిని. ఆయనతో సినిమా చేయడం గొప్ప అనుభూతిని ఇచ్చింది. కెమెరా ముందు మాత్రమే కాకుండా కెమెరా వెనుక కూడా ఆయన చాలా చమత్కారంగా మాట్లాడేవాడు. షారుఖ్ షర్ మాట్లాడుతూ ఉంటే అలాగే చూస్తూ ఉండి పోవాలి అనిపిస్తూ ఉంటుంది. ఆయనతో ఏ విషయం గురించి మాట్లాడినా చాలా ఆసక్తిగా వింటారు, అంతే ఆసక్తిగా ఆ విషయం గురించి మాట్లాడుతారు. ఆయన మాట్లాడే మాటలు ఎవరికైనా ఈజీగా అర్థం అవుతాయి.
ఆయనతో మాట్లాడిన సమయంలో చాలా విషయాల్లో నాకు పోలికలు ఉన్నట్లు అర్థం అయ్యింది. డబ్బులు ఇచ్చి మమ్మల్ని హైలైట్ చేయాలని అనుకోం. ఇద్దరం కూడా ఆ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాం. ఇద్దరికి కూడా పొగడ్తలు అంటే పెద్దగా ఇష్టం ఉండదు. ఎవరైనా నన్ను విమర్శిస్తే వారికి వెంటనే కాకుండా కాస్త ఆలస్యంగా అయినా వారంతట వారే తెలుసుకునే విధంగా సమాధానం చెబుతాను. షారుఖ్ సర్ కూడా అదే విధంగా తనపై వచ్చిన విమర్శలకు కాలమే సమాధానం చెబుతుంది అంటారు. అయితే ఆయన ఎప్పుడూ కష్టపడుతూ చేసే పనిలో బెస్ట్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు.
బాలీవుడ్ లో వరుసగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ సక్సెస్ లు దక్కించుకుని దూసుకు పోతున్న తాప్సి కి లక్కీ గా షారుఖ్ ఖాన్ తో కలిసి డంకీ సినిమాలో నటించే అవకాశం దక్కింది. ఆ సినిమా లో తాప్సి పాత్రకు మంచి ప్రాముఖ్యత లభించింది. షారుఖ్ ఖాన్ వంటి స్టార్ హీరోల సినిమాలో అలాంటి పాత్ర దక్కడం అంటే మామూలు విషయం కాదు. షారుఖ్ ఖాన్ తో కలిసి నటించడమే గొప్ప విషయం అనుకుంటే అలాంటిది చాలా కీలక పాత్రను దక్కించుకోవడంతో పాటు, ఆయనతో చాలా సమయం ను స్పెండ్ చేసే అవకాశం తాప్సి కి దక్కడం అదృష్టంగా నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.