చీరందంలో హీటెక్కించిన హాట్ బ్యూటీ!

తాప్సీ సోష‌ల్ మీడియా యాక్టివిటీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ప్రోఫెష‌న‌ల్ గా ఎంత బిజీగా ఉన్నా ప్ర‌యివేట్ ఫోటోల‌తోనూ అల‌రించ‌డం అమ్మ‌డి స్పెషాల్టీ

Update: 2024-07-14 06:25 GMT

తాప్సీ సోష‌ల్ మీడియా యాక్టివిటీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ప్రోఫెష‌న‌ల్ గా ఎంత బిజీగా ఉన్నా ప్ర‌యివేట్ ఫోటోల‌తోనూ అల‌రించ‌డం అమ్మ‌డి స్పెషాల్టీ. బాలీవుడ్ కి వెళ్లిన నాటి నుంచి ఈ రూల్ తూచ త‌ప్ప‌కుండా ఫాలోఅవుతుంది. అక్క‌డి ట్రెండ్ ని అనుస‌రిస్తూ గ్లామ‌ర్ వ‌ర‌ల్డ్ లో ఇలాగే ఉండాల‌ని ఎన్నోసార్లు ప్రూవ్ చేసింది. ఫ్యాష‌న్ ఎంపిక‌ల్లో త‌న‌ద‌మైన మార్క్ ఎలివేష‌న్ల‌తో ఆక‌ట్టుకున్న సంద ర్భాలెన్నో.

ఉత్త‌రాది అభిమానుల అభిరుచుకి త‌గ్గ‌ట్టు రూప‌లావ‌ణ్యంలో ఎన్నో మార్పులు చేసింది. మోడ్ర‌న్ దుస్తుల్లో సెగ‌లు పెట్టించిన సంద‌ర్భాలు కోకొల్ల‌లు. తాజాగా అమ్మ‌డు చీరందంలో హీటెక్కిస్తోన్న ఫోటోని ఇన్ స్టా వేదిక‌గా వ‌దిలింది. ఇందులో సొగ‌స‌రి బ్లూ చీర ధ‌రించి విశ్రాంతి తీసుకుటోన్న స‌మ‌యం ఇదంటూ కుర్రాళ్ల‌లోకి వ‌చ్చేసింది. పాల‌నురుగ‌ల సౌంద‌ర్యంపై బులుగు అందం ఆపై కొప్పులో గులాబీ పువ్వు తెరిచిన బ్యూటీతో అల‌రిస్తుంది. ఈ ఫోటోని ఉద్దేశించి ఇది విశ్రాంతి తీసుకునే స‌మ‌యం అంటూ రాసుకొచ్చింది. నెట్ ప్లిక్స్ రిలీజ్ ` హసీన్ -2` ప్ర‌చారంలో భాగంగా అమ్మ‌డు ఇలా తెర‌పైకి వ‌చ్చింది.

ఇక అమ్మ‌డి కెరీర్ సంగ‌తి చూస్తే కొంత కాలంగా బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ కంటే బాలీవుడ్ లో బెట‌ర్ గానే కొన‌సాగుతుంది. అక్క‌డికి వెళ్లిన త‌ర్వాత సొంతంగా నిర్మాణ సంస్థ‌ని సైతం స్థాపించి ప‌రిమిత బ‌డ్జెట్ లో సినిమాలు నిర్మిస్తుంది. అక్కడి సెల‌బ్రిటీలంద‌రితో అంతే మింగిల్ అవుతుంది. అక్క‌డే స్థిర‌ప‌డాలి అన్న ఉద్దేశంతో అమ్మ‌డు బాలీవుడ్ లో ముందుకు సాగుతుంది. అందుకు త‌గ్గ ప్ర‌ణాళిక వేసుకుని వెళ్తుంది.

దాదాపు గా నాలుగైదేళ్ల‌గా అక్క‌డే బిజీగా ఉంది. గ‌త ఏడాది ఒకే ఒక్క సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చినా ఈ ఏడాది మాత్రం నాలుగైదు సినిమాలో రావ‌డం ప‌క్కాగా క‌నిపిస్తుంది. ఇప్ప‌టికే కొన్ని క‌మిట్ అయిన ప్రాజెక్ట్ లు ఉన్నాయి. అవి షూటింగ్ దశ‌లో ఉన్నాయి. మ‌రికొన్ని చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నాయి. లాక్ అయితే ఏడాది ముగింపుక‌ల్లా పూర్తి చేసి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేయ‌డం ఖాయం.

Tags:    

Similar News