తమన్నా ప్రియుడు ఏడ్చుకుంటూ ఇంటికెళ్లిన రోజు!
బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ సుపరిచితమే. పుట్టి పెరిగింది హైదరాబాద్ లో అయినా స్థిర పడింది ముంబైలో. అలా బాలీవుడ్ లో నటుడయ్యాడు. తెలుగులో `ఎంసీఏ` సినిమాలో విలన్ గానూ నటించాడు.
బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ సుపరిచితమే. పుట్టి పెరిగింది హైదరాబాద్ లో అయినా స్థిర పడింది ముంబైలో. అలా బాలీవుడ్ లో నటుడయ్యాడు. తెలుగులో `ఎంసీఏ` సినిమాలో విలన్ గానూ నటించాడు. కానీ ఆ తర్వాత ఇక్కడ సినిమాలు చేయలేదు. ఇప్పుడీయన మిల్కీబ్యూటీ తమన్నా ప్రియుడిగా ఎంత ఫేమస్ అయ్యాడు? అన్నది చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఆయన నటుడిగా కంటే తమన్నా బోయ్ ప్రెండ్ గా పాపులర్ అవుతున్నాడు.
అందమైన మిల్కీని విజయ్ వర్మ దక్కించుకోవడంతో! అతనంత లక్కీ ఫెలో ఎవరుంటారు. ఇలా తమన్నా మనసులో స్థానం సంపాదించడం కంటే ముందు బాలీవుడ్ బాగా ఫేమస్ అయిన నటుడు. ఆ తర్వాత ఇవన్నీ. అయితే తెలుగు వాడైన విజయ్ వర్మ బాలీవుడ్ లో ఎదిగే క్రమంలో చాలా చేదు అనుభవాలు ఎదుర్కున్నట్లు తెలిపాడు. `ఓ స్టేజ్ లో ఆర్దికంగా ఇబ్బంది పడ్డాను.
అప్పుడు నా కౌంట్ లో 18 రూపాయులున్నాయి. అప్పుడు సినిమా అవకాశాలు రాలేదు. ఆ సమయంలో రిపోర్టర్ గా చేయమన్నారు. ఒక రోజు షూటింగ్. మూడు వేలు ఇస్తామననారు. ఆ పాత్ర చేయడం ఇష్టం లేకపోయినా డబ్బులు కోసం చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో మనసును బండరాయి చేసి షూటింగ్ చేసాను. ఆ రిపోర్టింగ్ ఇంగ్లీష్ లో చేయమన్నారు. అదంత ఈజీగా లేదు. దీంతో నన్ను సెట్ లో రిజెక్ట్ చేసారు
అప్పటికే ఓ సినిమాలో ప్రధాన పాత్ర పోషించి ఉన్నాను. అయినా సరే చిన్న నుటుడిగా భావించి సరైన గౌరవం ఇవ్వలేదు. ఆ రోజు ఇంటికి ఏడ్చుకుంటూ వచ్చాను. డబ్బు కోసం ఏది పడితే అది చేయకూడని అప్పుడే నిర్ణయించుకున్నా. ఈఘటన 2014 లో జరిగింది. అప్పటి నుంచి డబ్బు గురించి ఆలోచించ చడం మానేసాను. మనసుకు నచ్చిన పాత్రలే చేస్తున్నాను` అని అన్నారు.