తర్వాత అక్క‌డ ప‌రిస్థితి ఏలా ఉండ‌బోతుంది?

ఆగ‌స్టు 15కి ఇంకా 13 రోజులే స‌మ‌యం ఉంది. దీంతో ఇప్పుడ‌క్క‌డ ఓ స‌న్నివేశం ఆస‌క్తిక‌రంగా మారింది

Update: 2024-08-02 13:30 GMT

ఆగ‌స్టు 15కి ఇంకా 13 రోజులే స‌మ‌యం ఉంది. దీంతో ఇప్పుడ‌క్క‌డ ఓ స‌న్నివేశం ఆస‌క్తిక‌రంగా మారింది. ఆగ‌స్టు 15 త‌ర్వాత ప‌రిస్థితి ఎలా ఉండ‌బోతుంది? అన్న‌దానిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఇంతకీ ఏంటా ప‌రిస్థితి? అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. ఇటీవ‌లే త‌మిళ నిర్మాత‌ల మండ‌లి కొన్ని సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. అన్నింటిని ప‌క్క‌న‌బెడితే ఆగ‌స్టు 16 నుంచి కొత్త సినిమాలేవి త‌మిళ‌నాడులో మొద‌ల‌వ్వ‌కూడ‌ద‌ని నిర్మాత‌ల మండ‌లి నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే.

ప్ర‌త్యేకంగా హీరో ధ‌నుష్ ని హైలైట్ చేస్తూ ఈ రూల్ తెచ్చిన‌ట్లు ఇప్ప‌టికే మీడియాలో ప్ర‌చారం సాగుతోంది. ముందుగా అడ్వాన్సులు తీసుకున్న‌ సినిమాల‌కు డేట్లు కేటాయించ‌కుండా త‌ర్వాత తీసుకున్న వాటికి కేటాయించ‌డం ఏంటి? అని ధ‌నుష్ నిల‌దీసే ప్ర‌య‌త్నం చేసింది. నిర్మాత‌ల సంఘంలో నిర్మాత‌లు కొంత మంది ధ‌నుష్‌పై ఫిర్యాదు చేయ‌డంతో మండ‌లి ఈ విధంగా స్పందించింది. ధ‌నుష్ ని నియంత్రించే ప్ర‌క్రియ‌లో భాగంగా ఈనిర్ణ‌యం తీసుకున్న‌ట్లు హైలైట్ అయింది.

అయితే అత‌డిని సంప్ర‌దించ‌కుండా మండ‌లి తీసుకున్న ఏక‌ప‌క్ష నిర్ణ‌యాన్ని న‌డిగర్ సంఘం త‌ప్పు బ‌ట్టింది. అత‌డ‌తో మాట్లాడ‌కుండా ఇలాంటి నిర్ణ‌యాలు ఎలా తీసుకుంటార‌ని ధ‌నుష్ ని న‌డిగ‌ర్ అధ్య‌క్షుడు నాజ‌ర్ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. దీంతో పాటు సౌత్ న‌టీన‌టుల సంఘం కూడా మ‌ద్ద‌తుగా నిలిచింది. దీంతో కోలీవుడ్ న‌డిగ‌ర్ వర్సెస్ నిర్మాత‌ల మండ‌లి అన్న‌ట్లు స‌న్నివేశం మారింది.

ధ‌నుష్ కంటే ముందు విశాల్ విష‌యంలో దాదాపు ఇదే స‌న్నివేశం రిపీట్ అయింది. దీంతో ఆగ‌స్టు 15 త‌ర్వాత నిర్మాత‌ల మండ‌లి పిలుపు మేర‌కు కొత్త సినిమాల ప్రారంభోత్స‌వం ఆపేస్తారా? లేక కొన సాగిస్తారా? అన్న‌ది చూడాలి. ప్రారంభోత్స‌వాలు జ‌ర‌గాలంటే హీరోలు స‌హా నటీన‌టులంతా తీసుకున్న అడ్వాన్సులు తిరిగి ఇచ్చేయాలి. అప్పుడే అది సాద్య‌మ‌వుతుంది. మండ‌లి నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా వెళ్లే అవ‌కాశాలు త‌క్కువ‌గానే ఉంటాయి.

అలాగే నిర్మాత‌ల మండ‌లి-న‌డిగ‌ర్ మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగి ఈ స‌మ‌స్య ఓ కొలిక్కి వ‌స్తే ప్రారంభోత్స‌వాల‌కు, షూటింగ్ల‌కు ఇబ్బంది ఉండ‌దు. మండ‌లి నిర్ణ‌యం ప్ర‌కారం ఆక్టోబ‌ర్ లోపు సెట్స్ లో ఉన్న షూటింగ్ లు పూర్త‌వ్వాలి. అలాగే న‌వంబ‌ర్ నుంచి ఎలాంటి షూటింగ్ లు కూడా జ‌ర‌గ‌డానికి వీలు లేదు అనే కండీష‌న్ కూడా ఉంది. ఇలాంటి ప‌రిణామాల నేప‌థ్యంలో న‌డిగ‌ర్-నిర్మాత‌ల మండ‌లి మ‌ధ్య అత్య‌వ‌స‌ర భేటి అవ‌స‌ర‌మ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

Tags:    

Similar News