త‌మ‌న్నాప్ర‌త్యేక‌ పూజ‌లు పెళ్లి కోస‌మా?

విజ‌య్ వ‌ర్మ‌-త‌మ‌న్నా ప్రేమాయ‌ణం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇద్ద‌రు కొంత కాలంగా పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగి తేలుతున్నారు.

Update: 2024-01-29 07:52 GMT

విజ‌య్ వ‌ర్మ‌-త‌మ‌న్నా ప్రేమాయ‌ణం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇద్ద‌రు కొంత కాలంగా పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగి తేలుతున్నారు. ఒక‌ర్ని ఒక‌రు ఎంత‌గా ఇష్ట‌ప‌డుతున్నారో? వాళ్లు మాట తీరును బ‌ట్టే తెలుస్తుంది. కానీ పెళ్లి ఎప్పుడు అంటే? మాత్రం స‌రైన క్లారిటీ రావ‌డం లేదు. పెళ్లి విష‌యంలో విజ‌య్ వ‌ర్మ రెడీగా ఉన్నా..త‌మ‌న్నా మాత్రం ఏదో సాకు చెబుతూ ఆవిష‌యాన్ని స్కిప్ కొడుతుంది.

దీంతో ఈ వ్య‌వ‌హారం పెళ్లి వ‌ర‌కూ వెళ్తుందా? మ‌ధ్య‌లోనే వీగిపోతుందా? అన్న సందేహాలు సైతం తెర‌పైకి వ‌చ్చాయి. కానీ వాళ్లిద్ద‌రి మ‌ధ్య అన్యోన్య‌త‌ని చూస్తుంటే మాత్రం అలా ఎందుకు జ‌రుగుతుంది? త‌ప్ప కుండా పెళ్లి చేసుకుంటారు? అనే మెజార్టీ వ‌ర్గం అభిప్రాయ‌ప‌డుతుంది. తాజాగా మిల్కీబ్యూటీ యాక్టివిటీస్ కొన్ని ఈ ఆశ‌ల్ని మ‌రింత బ‌ల‌ప‌రుస్తున్నాయి. ఇటీవ‌లే త‌మ‌న్నా దైవ చింత‌న‌లో మునిగిన వైనం తెలిసిందే. ఏ దేవాల‌యం వ‌దిలి పెట్ట‌డం లేదు.

వ‌రుసుగా దేశంలో ఉన్న దేవాల‌యాల్ని అన్నింటిని చుట్టేస్తుంది. ఇటీవ‌లే కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి అస్సాం గౌహ‌తిలోని కామాఖ్య ఆల‌యాన్ని సంద‌ర్శించింది. అక్క‌డ ప్ర‌త్యేక పూజ‌లు చేసింది. త‌ల్లిదం డ్రుల‌తో క‌లిసి కూర్చుని పూజ‌లు చేసింది. భార‌త‌దేశంలోనే అత్యంత శ‌క్తివంత‌మైన ఆల‌యంగా దీనికి పేరుంది. సంతాన ప్రాప్తి క‌ల‌గాలి అనుకునే వారు ఎక్కువ‌గా ఈ దేవాల‌యానికి వెళ్తుంటారు.

ఈ విష‌యంలో భ‌క్తులు ఎంతో బ‌లంగా న‌మ్ముతుంటారు. ఎంతో శ‌క్తివంత‌మైన ఆల‌యంగా చెబు తుంటారు. ఇంకా శ‌నిగ్ర‌హ పూజ‌ల‌కు ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది. పెళ్లి కాని వారు వివాహం త్వ‌ర‌గా జ‌ర‌గాల‌ని ఆల‌యంలో మొక్కుతార‌ని అంటారు. ఇలాంటి ఎన్నో ప్ర‌త్యేక‌త‌లు కామాఖ్య దేవాలాయనికి ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఎన్న‌డు లేనిది ప్ర‌త్యేకంగా త‌మ‌న్నా కుటుంబ స‌భ్యుల‌తో ఆ దేవాల‌యానికి వెళ్ల‌డంతో ఆస‌క్తి సంత‌రించుకుంది. వివాహం..త‌ర్వాత అనంత‌రం జీవితం సంతోషంగా ఉండాల‌ని అవ‌స‌ర‌మైన శ‌నిగ్ర‌హ పూజ‌లు త‌మ‌న్నా అక్క‌డ చేసిన‌ట్లు ప్ర‌చారం సాగుతోంది.

Tags:    

Similar News