జ‌పాన్ అభిమానికి మాటిచ్చిన యంగ్ టైగ‌ర్!

ఓ జ‌పాన్ అభిమానితో ప్ర‌త్యేకించి తార‌క్ ఎంతో అభిమానంతో చుట్టూ చాలా డిస్ట‌బెన్స్ గా ఉన్నా? ఎంతో ఓపిక‌గా మాట్లాడారు.

Update: 2024-09-27 09:42 GMT

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ స‌తీస‌మేతంగా అమెరికాలో జ‌రుగుతోన్న బియాండ్ ఫెస్ట్ కి హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. ఇందులో `దేవ‌ర` చిత్రాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఆమూవ్ మెంట్స్ని లైవ్ లో ఆస్వాదించేందుకే తార‌క్ భార్య , పిల్ల‌ల‌తో క‌లిసి లాస్ ఏంజెల్స్ కి వెళ్లారు. ఈ సంద‌ర్భంగా తార‌క్ అభిమానుల‌తో క‌లిసి సినిమా వీక్షించారు. అనంత‌రం అభిమానుల‌తో మాట మంతి జ‌రిపాడు. ఓ జ‌పాన్ అభిమానితో ప్ర‌త్యేకించి తార‌క్ ఎంతో అభిమానంతో చుట్టూ చాలా డిస్ట‌బెన్స్ గా ఉన్నా? ఎంతో ఓపిక‌గా మాట్లాడారు.

ఈ సంద‌ర్భంగా `మీదేశానికి త‌ప్ప‌కుండా వ‌స్తానంటూ` ఓ మ‌హిళా అభిమానికి తార‌క్ మాట ఇచ్చారు. ఆ మ‌హిళ త‌మ దేశం రావాల్సిందిగా తార‌క్ని కోరిన‌ట్లుంది. ఈ నేప‌థ్యంలోనే ఆమెకి అలా స‌మాధానం ఇచ్చారు. జపాన్ లో తార‌క్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయ‌న అభిమానించే వారు ఎంతో మంది ఉన్నారు. ఈ క్రమంలోనే బియాండ్ వేడుక‌లో తార‌క్ ని క‌లిసేందుకు ఎంతో ప్ర‌య‌త్నించింది. బియాండ్ పెస్ట్ లో తార‌క్ పాల్గొంటున్నాడ‌ని తెలిసి టోక్యో నుంచి అమెరికా వ‌చ్చింది.

కానీ ఇవేవి తార‌క్ తెలియ‌కుండానే ఆమెతో మాట్లాడాడు. ఆత‌ర్వాత విష‌యం తెలుసుకుని ఎంతో స‌ర్ ప్రైజ్ అయ్యాడు. ఈ స‌మ‌యంలోనే తార‌క్నిచూసేందుకు జ‌పాన్ లో ఎంతో మంది ఎదురు చూస్తున్నార‌ని త‌మ దేశానికి రావాల్సిందిగా కోరింది. దీంతో తార‌క్ ఆమెకి వ‌స్తాన‌ని మాట ఇచ్చారు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది. అభిమానుల్నీ ఈ వీడియో ఆక‌ట్టుకుంటోంది. తార‌క్ అభిమానులో ఎంతో అభిమానంతో ప్రేమ‌తో మాట్లాడుతారు.

అభిమానుల ప‌ట్ల ఎన్నో జాగ్ర‌త్త‌లు సూచిస్తుంటారు. త‌న సినిమా ఫంక్ష‌న్ల‌కు వ‌చ్చిన‌ప్పుడు అంతా ఇళ్ల‌కు క్షేమంగా చేరుకోవాల‌ని...జాగ్ర‌త్త‌గా వెళ్లాల‌ని చెబుతుంటారు. అభిమానుల ప‌ట్ల స‌హాయ కార్య‌క్ర‌మాలు అలాగే చేస్తారు. తార‌క్ న‌టించిన 'దేవ‌ర' భారీ అంచ‌నాల మ‌ధ్య నేడు రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News