రౌడీ స్టార్ ట్యాక్సీవాలాని మళ్లీ దించుతున్నాడా?
ఇప్పటికే విజయ్-రాహుల్ సంకృత్యన్ కాంబినేషన్ లో 'ట్యాక్సీవాలా' అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.
విజయ్ దేవరకొండ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గ్యాప్ తీసుకోకుండానే సినిమాలు కమిట్ అవుతున్నాడు. ఒకటి పూర్తి చేయడం మరో సినిమా పట్టాలెక్కించడం. ఇదే కొంత కాలంగా రౌడీబోయ్ యాక్టివిటీ. ప్రస్తుతం పరశురాంతో చేస్తోన్న ఫ్యామిలీ స్టార్ ముగింపు దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు.
ఆ సినిమా ఎప్పుడైనా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సన్నిహిత వర్గాల సమాచారం. ఈ సినిమా కాకుండానే విజయ్ సైన్ చేసిన మరో ప్రాజెక్ట్ కూడా ఉంది. రవి కిరణ్ కోలా దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విజయ్ కోసం మరో దర్శకుడు కూడా లైన్ లోకి వస్తున్నాడు. రాహుల్ సంకృత్యన్ విజయ్ కోసం ఓ స్టోరీ సిద్దం చేసాడుట. ఇప్పటికే ఇరువురి మధ్య స్టోరీ డిస్కషన్ తంతు కూడా ముగిసిందని సమాచారం.
కథ నచ్చడంతో విజయ్ కూడా నటించడానికి అంగీకరించానడని తెలిసింది. విజయ్ రొమాంటిక్ ఇమేజ్ ని బేస్ చేసుకుని రాహుల్ రాసిన స్టోరీ అని సన్నిహితుల నుంచి తెలిసింది. ఈ చిత్రాన్ని నిర్మించడానికి మైత్రీ మూవీ మేకర్స్ ముందుకొస్తుందిట. ఇప్పటికే విజయ్-రాహుల్ సంకృత్యన్ కాంబినేషన్ లో 'ట్యాక్సీవాలా' అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.
'అర్జున్ రెడ్డి'..'గీతగోవిందం' లాంటి బ్లాక్ బస్టర్లు అప్పటికే విజయ్ ఖాతాలో ఉన్నప్పటికీ 'ట్యాక్సీవాలా'పై తీవ్ర స్థాయిలో నెగిటివ్ ప్రచారం తెరపైకి వచ్చింది. అదే సమయంలో విజయ్ నీ వెనుక నేను ఉన్నానం టూ అల్లు అరవింద్ ముందుకొచ్చారు. రిలీజ్ అనంతరం ట్యాక్సీవాలా మంచి వసూళ్లని సాధించింది. ఆ తర్వాత ఇద్దరు వేర్వేరు సినిమాలు చేసారు తప్ప కలిసి పనిచేయలేదు. మళ్లీ ఇంత కాలానాకి ఆ కాంబినేషన్ చేతులు కలుపుతుంది.