IIFA.. రానా, తేజ గట్టిగా ప్రాక్టీస్ చేస్తున్నారుగా!

సినీ రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఐఫా అవార్డుల వేడుక మరికొద్ది గంటల్లో మొదలవనుంది.

Update: 2024-09-26 11:24 GMT

సినీ రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఐఫా అవార్డుల వేడుక మరికొద్ది గంటల్లో మొదలవనుంది. అబుదాబి వేదికగా సెప్టెంబర్‌ 27 నుంచి 29 వరకు గ్రాండ్ గా జరగనుంది. ఈ పెద్ద సినీ పండగ కోసం ఇప్పటికే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన అనేక మంది సెలబ్రిటీలు అక్కడికి చేరుకున్నారు. మరికొందరు చేరుకుంటున్నారు. తమ క్రేజీ ఔట్ ఫిట్స్ తో అట్రాక్షన్ గా నిలవనున్నారు. ఎంతో స్పెషల్ అయిన ఐఫా అవార్డులు అందుకునేందుకు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.


అయితే ఏ ఈవెంట్ కు అయినా హోస్టింగ్ కంపల్సరీ కదా.. వారితోనే అసలైన సందడి ఉంటుంది.. తమ మాట తీరుతో హోస్ట్స్ అందరినీ అలరిస్తుంటారు.. నవ్విస్తుంటారు.. క్రేజీగా రెస్పాండ్ అయ్యి మెప్పిస్తుంటారు. దీంతో అవార్డుల వేడుకకు నిర్వాహకులు సరైన వారిని హోస్టులుగా ఎంచుకుంటారు. ఇప్పుడు అబుదాబిలో జరగనున్న ఐఫా 2024 అవార్డ్ ఫంక్షన్ కు మన టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి, సూపర్ హీరో తేజ సజ్జా.. హోస్టులుగా వ్యవహరించనున్నారు.


ఇప్పటికే వారు.. అబుదాబి చేరుకున్నారు. హోస్టింగ్ కోసం గట్టిగా ప్రాక్టీస్ చేస్తున్నారు! బిగ్ స్టేజ్ షోలో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. అందుకోసం రానా, తేజ కలిసి డిస్కస్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం వారిద్దరి ప్రాక్టీస్ కు సంబంధించిన పిక్స్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇద్దరూ ఫుల్ బియర్డ్ లుక్ లో క్రేజీగా కనిపిస్తున్నారు. అదే లుక్స్ తో ఐఫా వేడుక వేదికపై సందడి చేయనున్నట్లు ఫోటోల ద్వారా క్లారిటీ వచ్చేసింది.

అయితే రీసెంట్ గా ముంబైలో ఐఫా అవార్డుల స్పెషల్ ప్రీ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఆ వేడుకకు రానా దగ్గుబాటితో పాటు బాలీవుడ్‌ హీరో షారుక్‌ ఖాన్‌, రానా, కరణ్‌ జోహర్‌, సిద్ధాంత్‌ చతుర్వేది ఇతరులు హాజరై సందడి చేశారు. ఆ సమయంలో షారుక్‌ కాళ్లకు రానా నమస్కారం చేసిన పిక్స్, వీడియోస్ ఫుల్ వైరల్ గా మారాయి. తాము పూర్తిగా సౌత్ వాళ్లమని, ఇలానే కాళ్లకు నమస్కారం చేస్తామని రానా అప్పుడు చెప్పడంతో.. నెట్టింట మంచి ప్రశంసలు వచ్చాయి.

అంతకుముందు.. హైదరాబాద్ లోని మాదాపూర్‌ లో కూడా ఐఫా 2024 ముందస్తు వేడుకను ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఆ ఈవెంట్ కు సుశాంత్‌, దేవిశ్రీ ప్రసాద్‌, శ్రీలీల, రాశీ ఖన్నా, ప్రగ్యా జైశ్వాల్‌ తదితరులు హాజరవ్వగా.. రానా, తేజ సజ్జా వేరే లెవెల్ లో అలరించారు. ఇప్పుడు ఐఫా అవార్డుల వేడుకను హోస్ట్ చేయనున్నారు. మరి రానా, తేజ సజ్జా తమ హోస్టింగ్ తో ఎలా మెప్పిస్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News