ఒక్క సినిమా కోసం 75 వదులుకున్నాడట!
తాజా ఇంటర్వ్యూలో తేజ మాట్లాడుతూ.. తాము హనుమాన్ సినిమా కోసం రెండున్నర సంవత్సరాల పాటు కష్టపడ్డాము.
బాల నటుడిగా టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి మెప్పించిన తేజ సజ్జా హీరోగా వరుసగా మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నాడు. తాజాగా వచ్చిన హనుమాన్ సినిమా ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. టాలీవుడ్ చరిత్రలో సంక్రాంతి భారీ బ్లాక్ బస్టర్ సినిమాగా హనుమాన్ నిలిచింది.
అంతటి విజయాన్ని సొంతం చేసుకున్న హీరో తేజ సజ్జా చాలా హ్యాపీగా ఉన్నాడు. ఆయన క్రేజ్, స్థాయి ఒక్కసారిగా పది రెట్లు పెరిగినట్లు అయ్యింది. అయితే హనుమాన్ విజయం అంత సులభంగా రాలేదని యూనిట్ సభ్యులు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. తాజాగా తేజ కూడా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తాజా ఇంటర్వ్యూలో తేజ మాట్లాడుతూ.. తాము హనుమాన్ సినిమా కోసం రెండున్నర సంవత్సరాల పాటు కష్టపడ్డాము. ఈ రెండున్నర ఏళ్లలో నా వద్దకు ఏకంగా 70 నుంచి 75 సినిమా ఆఫర్లు నా వద్దకు వచ్చాయి. కానీ నేను హనుమాన్ సినిమా తర్వాతే ఏ సినిమా అయినా అంటూ వాటన్నింటిని తిరస్కరించాను అంటూ చెప్పుకొచ్చాడు.
తేజ సజ్జా 75 సినిమాలు కాదని హనుమాన్ సినిమా కోసం రెండున్నర ఏళ్లు కష్టపడినందుకు ప్రతిఫలం ఆ స్థాయిలోనే లభించింది. పది సినిమాలు చేసినా దక్కని గుర్తింపు గౌరవం కేవలం హనుమాన్ సినిమాతో తేజకి దక్కింది అనడంలో సందేహం లేదు. హనుమాన్ సినిమా తేజ కెరీర్ లో నిలిచి పోయే సినిమా అయ్యింది.
హనుమాన్ సినిమా ఫలితం నేపథ్యంలో హీరో తేజ తో పెద్ద నిర్మాణ సంస్థలు మరియు ప్రముఖ దర్శకులు సినిమాలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. హనుమాన్ సమయంలో తన వద్దకు వచ్చిన ఆఫర్లకు ఓకే చెప్పి ఉంటే కచ్చితంగా తప్పుడు నిర్ణయం అయ్యి ఉండేది. సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకున్న వారికే కెరీర్ లో విజయం దక్కుతుందని హనుమాన్ తో నిరూపితం అయ్యింది.