ఫోటో స్టోరి: తెలుగమ్మాయి బికినీ యోగ
ఇక బికినీ యోగ ప్రత్యేకత ఏమిటో తేజస్వి స్వయంగా వివరిస్తే తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.
యోగా టీచర్ల యోగా క్లాసుల వీడియోలు యూట్యూబ్ లో కుప్పలుతిప్పలు. కానీ ఇప్పుడు ఆ యోగా క్లాసులన్నిటినీ కొట్టేసేలా బికినీ యోగ నేర్పిస్తోంది తెలుగమ్మాయి తేజస్వి మాదివాడ. ఇదిగో ఇప్పుడు ఇన్ స్టా మాధ్యమంలో ఎటువైపు చూసినా జోరుగా వైరల్ అవుతున్న ఏకైక భంగిమ ఇది.
నేటితరం తారలకు ధీటుగా ఇన్ స్టాలో ఫాలోవర్స్ ని పెంచుకునేందుకు తెలుగమ్మాయి ప్రయత్నమిది. ఇక బికినీ యోగ ప్రత్యేకత ఏమిటో తేజస్వి స్వయంగా వివరిస్తే తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. రిఫ్లెక్సన్ ఆఫ్ సెల్ఫ్! పేరుతో సూర్యోదయం వేళ ఇలా సూర్యనమస్కారం చేస్తూ కనిపించింది తేజస్వి. బీచ్ లో లేలేత సూర్య కాంతిని అద్భుతంగా ఆవిష్కృతమైంది. తేజస్వి ఫ్లోరల్ బికినీలో ఎంతో స్పెషల్ గా కనిపిస్తోంది.
బిగ్ బాస్ -తెలుగు నటిగా పాపులరైన తేజస్వి మాదివాడ ఆర్జీవీ తెరకెక్కించిన ఐస్ క్రీమ్ సినిమాతో కథానాయిక అయింది. ఆ తర్వాత చాలా జర్నీ చేసింది. ఆశించినంత స్టార్ డమ్ దక్కకపోయినా కానీ కెరీర్ బండిని సాఫీగా లాగించేస్తోంది. చిన్న సినిమా పెద్ద సినిమా.. వెబ్ సిరీస్ అనే తేడా లేకుండా తనవైపు వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ తేజస్వి తన కెరీర్ ని చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు.
కెరీర్ జర్నీ :
తేజస్వి మాదివాడ 2013లో మహేష్- వెంకీలతో ఫ్యామిలీ డ్రామా చిత్రం `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`లో సపోర్టింగ్ రోల్‌తో తొలిసారిగా నటించింది. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ హారర్ చిత్రం ఐస్ క్రీమ్‌లో తన మొదటి లీడ్ పాత్రను పోషించింద. దానికి ముందు మనం .. నితిన్ హార్ట్ ఎటాక్ లో సహాయ పాత్రలలో కనిపించింది. లవర్స్, అనుక్షణం, క్రాంతి మాధవ్ - మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, శ్రీమంతుడు, పండగ చేస్కో లాంటి చిత్రాల్లో సహాయక పాత్రలతో మెప్పించింది. ఆ తర్వాతా రాజు గారి గది, ఊర్వసి వో రాక్షసి వో, సుబ్రమణ్యం ఫర్ సేల్, తమిళ చిత్రం నట్పతిగారంలలో నటించింది. స్టార్ మాలో టెలివిజన్ డ్యాన్స్ సిరీస్ BB జోడిలోను ప్రతిభను నిరూపించింది. 2022లో కమిట్ మెంట్ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. తేజస్వి తదుపరి ప్రాజెక్టుల గురించి వెల్లడించాల్సి ఉంది.