సంక్రాంతి సినిమాల వివాదం.. నిర్మాతల మండలి షాకింగ్ రియాక్షన్

ఈసారి సంక్రాంతి సీజన్ లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పోటీ నెలకొన్న విషయం తెలిసిందే

Update: 2024-01-09 13:46 GMT

ఈసారి సంక్రాంతి సీజన్ లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ఏకంగా ఐదు సినిమాలు సంక్రాంతి రిలీజ్ కి సిద్ధమయ్యాయి. దీంతో ఇది కాస్త ఓ వివాదంగా మారింది. దీంతో ఇదే విషయమై తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి మరోసారి వివరణ ఇచ్చింది.." సంక్రాంతి సినిమాల రిలీజ్ అంశమై 15 రోజుల క్రితం మాటలతో ఓ సమావేశం నిర్వహించి మాట్లాడడం జరిగింది.


ఈ సంక్రాంతికి గుంటూరు కారం, హనుమాన్, ఈగల్, సైంధవ్, నా సామిరంగ.. ఐదు సినిమాలు పోటీకి దిగాయి. మా రిక్వెస్ట్ మన్నించి ఈగల్ సినిమా రిలీజ్ ను హీరో రవితేజ, నిర్మాతలు ఫిబ్రవరి 9కి మార్చారు. ఒక మాస్ హీరో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకొని మళ్లీ వెనక్కి తగ్గడం అంటే అది మామూలు విషయం కాదు. ఇండస్ట్రీ బాగుకోసం ఆయన ముందుకొచ్చి సినిమా రిలీజ్ డేట్ మార్చుకోవడం ఇండస్ట్రీకే శుభ పరిణామం.


అదేవిధంగా తమిళ హీరోలైన రజనీకాంత్ గారు, ధనుష్ గారు మాకు సహకరించి తమ సినిమాలను వాయిదా వేసుకున్నారు. శివ కార్తికేయన్ తమిళ్ సినిమా కూడా రిలీజ్ కి ఉంటే వాళ్లతో మాట్లాడి తమ సినిమాని 19కి వాయిదా వేయించాం. సంక్రాంతి సినిమాల మధ్య పోటీ అంటే ఓ హెల్దీ వాతావరణం లో జరగాలి. తెలుగు సినిమాకు సంబంధించి మా మూడు సంస్థలు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిర్ణయాలు తీసుకుని ముందుండి నడిపిస్తున్నాం.

కానీ కొన్ని సోషల్ మీడియా వెబ్సైట్స్, ఇతర మీడియా తమ టిఆర్పి, రేటింగ్స్ కోసం కావాలనే ఇష్టమైన రాతలు, ఆర్టికల్స్ రాస్తూ ఇండస్ట్రీలో ఇబ్బందికర వాతావరణం సృష్టిస్తున్నారు. వీటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇకనుంచైనా వార్తలు రాసే ముందు మా సంస్థలను సంప్రదించి నిజా నిజాలు తెలుసుకొని వార్తలను ప్రచురించండి.

ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్పడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ అబద్ధపు వార్తలు ప్రచురించి వారి మనోభావాలను, వారి ప్రతిష్టను భంగం కలిగించడం కరెక్ట్ కాదు. ఇకనుంచి ఇలాంటి వార్తలు రాసే వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. విడుదలయ్య ప్రతి సినిమా సక్సెస్ కావాలి, పరిశ్రమ బాగుండాలి అనేదే మా ప్రయత్నం. తెలుగు ఇండస్ట్రీతో మీడియాకు ఉన్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై మీడియా యాజమాన్యాలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం" అంటూ వివరణలో పేర్కొన్నారు.

Tags:    

Similar News