కంటెంట్ ఉంటే టికెట్ కోసం ప్రేక్షకుడు ఎంతైనా!
తాజాగా నిర్మాత టి.జి విశ్వప్రసాద్ ముందుకు ఇదే ప్రశ్న వెళ్లింది. టికెట్ ధరలపై నిర్మాతగా మీ అభిప్రాయం ఏంటి? అని ప్రశ్నించగా...ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
సాధారణ ప్రేక్షకుడు సినిమాకి దూరం అవ్వడానికి టికెట్ ధర కూడా ఓ కారణమని గతంలో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధరలని తగ్గించి సినిమాలు ఆడించాలని పెద్దలు నిర్ణయిం చారు. అవసరం మేర టికెట్ ధరలు పెంచాలి...అలాగే సామాన్యుడి మీద అతి భారం కూడా పడకూడదని రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుని ధరలు ఉండాలని నిర్ణయించారు. సినిమా బడ్జెట్ ని బట్టి కూడా టికెట్ ధరలు పెంచి రిలీజ్ చేస్తున్నారు.
ఎందుకంటే ఇప్పుడే సినిమా అయిన వారం రోజుల్లో బాక్సాఫీస్ లెక్కలు మార్చాల్సిన పరిస్థితి. దీనిలో భాగంగా అధికంగా థియేటర్లు కేటాయించి వారం రోజుల్లోనే 100 రోజుల వసూళ్లు సమానంగా సాధిస్తున్నారు. తాజాగా నిర్మాత టి.జి విశ్వప్రసాద్ ముందుకు ఇదే ప్రశ్న వెళ్లింది. టికెట్ ధరలపై నిర్మాతగా మీ అభిప్రాయం ఏంటి? అని ప్రశ్నించగా...ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
'చిత్ర పరిశ్రమలో మేం ఒక భాగం. పరిశ్రమ టికెట్ ధరల్ని తగ్గిస్తే అందుకు మేమూ సిద్దమే. అయితే ఈరోజు ఉన్న పరిస్థితుల్ని బట్టి థియేటర్ నుంచి ఎక్కువ డబ్బు రాబట్టుకోవాల్సిన అసవరం ఉంది. అలాగని ఆ భారం ప్రేక్షకుడిపై పడకూడదు. అయితే టికెట్ ధరలు ఎక్కువగా ఉండటం వల్ల ప్రేక్షకుడు థియేటర్ కు రాకపోవడమనేది ఉండదు. మన సినిమాతో ప్రత్యేకమైన కంటెంట్ ని అందిస్తే థియేటర్ కి ప్రేక్షకుడు వస్తాడు.
అలాగని సాధారణ స్థాయిలోనూ టికెట్ ధరలు అనేవి ఉండకూడదు. రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుని వెళ్లాలి' అని అన్నారు. స్టార్ హీరోల సినిమాల కోసం అభిమానులు ఎలా ఎగబడతారు? అన్నది చెప్పాల్సి న పనిలేదు. తొలి షో చూడాలి అన్న ఉత్సాహంతో వేల రూపాయలు ఖర్చు చేస్తారు. సినిమా బాగుంటే బయటకొచ్చి కాలరెగరేసి హిట్ కొట్టాం అంటారు. ఇది తెలుగు, తమిళ సినిమా హీరోలకి మాత్రమే సాధ్యమైంది.