మూడు షిప్టులు డ్యూటీ...డేలో 22 గంటలు షూటింగ్ లోనే!
తాజాగా ఈ జాబితాలో ఇప్పుడు తల అజిత్ కూడా చేరారు. ప్రస్తుతం ఆయన కూడా మూడు షిప్టులు పని చేస్తున్నారు. అజిత్ హీరోగా 'విదామయూర్చి', 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాలు తెరకెక్కుతోన్నసంగతి తెలిసిందే.
మూడు షిప్టులు పనిచేసే హీరోలు ఎవరంటే? ఠక్కున మలయాళం స్టార్లు గుర్తొస్తారు. మోహన్ లాల్, మమ్ము ట్టి లాంటి స్టార్లు మాత్రమే ఇప్పటికీ మూడు షిప్టులు పని చేస్తున్నారు. ఏడాదిలో కనీసం ఆరు సినిమాల తోనైనా ప్రేక్షకుల్లో ఉంటారు. ఇది ఇప్పటి నుంచి కాదు. కొన్ని దశాబ్ధాలుగా కొనసాగిస్తున్నారు. డాడ్ మమ్ముట్టిలా మూడు షిప్టులు పని చేయాలని దల్కర్ సల్మాన్ కూడా అప్పుడప్పుడు ప్రయత్నిస్తుంటాడు.
ఇక తెలుగులో మూడు షిప్టులు పనిచేసిన హీరో ఎవరంటే? సూపర్ స్టార్ కృష్ణ పేరు వినిపిస్తుంది. ఆ తర్వాత జనరేషన్ హీరోల్లో చిరంజీవి, రజనీకాంత్ లాంటి వారు కెరీర్ ఆరంభంలో కొన్ని సినిమాలకు పని చేసారు. తాజాగా ఈ జాబితాలో ఇప్పుడు తల అజిత్ కూడా చేరారు. ప్రస్తుతం ఆయన కూడా మూడు షిప్టులు పని చేస్తున్నారు. అజిత్ హీరోగా 'విదామయూర్చి', 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాలు తెరకెక్కుతోన్నసంగతి తెలిసిందే.
ప్రస్తుతం రెండు సినిమాలు సెట్స్ లో ఉన్నాయి. విదామయూర్చి చిత్రాన్ని అక్టోబర్ లో రిలీజ్ చేస్తున్నట్లు డేటు కూడా ఇచ్చారు. దీంతో అజిత్ రెండు సినిమాలకు పేర్లల్ గా డేట్లు కేటాయించి షూటింగ్ హాజర వుతున్నారు. కొన్ని రోజుల్లో ఒకేసారి రెండు సినిమా షూట్ లకు హాజరవుతున్నారు. మొత్తంగా ఆయన డేలో 22 గంటల పాటు కూడా పనిచేస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ లోనే రెండు సినిమాల షూటింగ్ లు జరగడంతో అలా ప్లాన్ చేసి ముందుకెళ్తున్నారు.
అవసరం మేర వేర్వేరు ప్రాంతాల్లో షూట్ ఉన్నా? జర్నీలు చేసి హాజరవుతున్నారుట. దీంతో అజిత్ నిబద్దత బయటపడింది. అజిత్ ఇలా సినిమాలు చేయడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గుడ్ బ్యాడ్ అగ్లీ ని తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. 270 కోట్ల బడ్జెట్ తో దీన్ని అధిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తున్నారు.