దళపతి, తలైవా.. ఫైట్ తప్పేలా లేదు

ఇళయదళపతి విజయ్ ఇటీవల ‘ది గోట్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమా ఆశించిన స్థాయిలో క్లిక్కవ్వలేదు.

Update: 2024-09-15 09:30 GMT
దళపతి, తలైవా.. ఫైట్ తప్పేలా లేదు
  • whatsapp icon

ఇళయదళపతి విజయ్ ఇటీవల ‘ది గోట్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమా ఆశించిన స్థాయిలో క్లిక్కవ్వలేదు. ఇప్పుడు హెచ్ వినోద్ దర్శకత్వంలో 69వ చిత్రానికి సిద్ధం అవుతున్నాడు. తాజాగా ఈ మూవీ అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చింది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కథతో ఈ చిత్రం ఉండబోతోందని కాన్సెప్ట్ పోస్టర్ తోనే క్లారిటీ వచ్చింది. ప్రజాస్వామ్యానికి టార్చ్ బేరర్ అంటూ సినిమా పోస్టర్ లో దళపతి క్యారెక్టర్ ని ఎలివేట్ చేశారు. గతంలో దళపతి విజయ్ సర్కార్ సినిమాని రాజకీయాల నేపథ్యంలోనే చేశాడు.

ఇందులో ఓటుహక్కు వినియోగం గురించి చెప్పాడు. ఇప్పుడు హెచ్ వినోద్ దర్శకత్వంలో ఎలాంటి కథాంశంతో మూవీ చేయనున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాని 2025 అక్టోబర్ లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. దళపతి విజయ్ చివరి చిత్రం కావడంతో కచ్చితంగా ఈ సినిమాకి తమిళనాట విపరీతమైన క్రేజ్ ఉంటుంది.

అయితే ‘దళపతి 69’ చిత్రానికి పోటీగా అక్టోబర్ లోనే సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్ 2’ మూవీ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ మూవీ షూటింగ్ లో ఉన్నారు. దీంతో పాటుగా నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో ‘జైలర్ 2’ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళబోతున్నాడంట. గత ఏడాది రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ‘జైలర్’ మూవీకి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది.

రీసెంట్ గా నెల్సన్ దిలీప్ రజినీకాంత్ కి స్టోరీ నేరేషన్ ఇచ్చేశాడంట. అతను గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో షూటింగ్ కి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనుంది. ఈ మూవీ షూటింగ్ కి వీలైనంత వేగంగా కంప్లీట్ చేసి 2025 అక్టోబర్ నెలలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అంటే దళపతి విజయ్, తలైవా రజినీకాంత్ మొదటి సారి బాక్సాఫీస్ దగ్గర వారి సినిమాలతో పోటీ పడే అవకాశాలు

ఇమేజ్ పరంగా ఇద్దరు కూడా తమిళనాట మంచి ఛరిష్మా ఉన్నవారే కావడంతో రెండింటికి క్రేజ్ ఉంటుంది. అయితే ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ చేసే ధైర్యం నిర్మాతలు చేయకపోవచ్చని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఒకే సారి రిలీజ్ చేయడం వలన రెండు పాజిటివ్ టాక్ తెచ్చుకున్న కూడా కలెక్షన్స్ పై ప్రభావం చూపే ఛాన్స్ ఉంటుందనే మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News