సూపర్ స్టార్ సినిమా సగం రాబట్టలేదు..!
తమిళ్ సూపర్ స్టార్ విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందిన 'ది గోట్' సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తమిళ్ సూపర్ స్టార్ విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందిన 'ది గోట్' సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు లో ది గోట్ సినిమాకి బజ్ క్రియేట్ అయింది. దాంతో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసేందుకు గాను రూ.15 కోట్లకు కొనుగోలు చేయడం జరిగింది. తమిళనాట రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్ ను దక్కించుకుని, అప్పుడే వంద కోట్లను క్రాస్ చేసిన ది గోట్ తెలుగు వర్షన్ మాత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను పట్టించుకోవడం లేదు.
మొదటి మూడు రోజులు ఒక మోస్తరు వసూళ్లు నమోదు అయినా సోమవారం నుంచి వసూళ్లు పూర్తిగా డ్రాప్ అయ్యాయి. సినిమా ను రూ.15 కోట్లకు కొనుగోలు చేయగా, ఇప్పటి వరకు అందులో కనీసం సగం వసూళ్లు రాలేదనే టాక్ వినిపిస్తోంది. బాక్సాఫీస్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థకు ది గోట్ సినిమా పెద్ద మొత్తంలో నష్టాన్ని మిగిల్చినట్లుగా తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో మైత్రి మూవీ మేకర్స్ వారు పంపిణీ చేసిన సినిమాల్లో అతి పెద్ద నష్టంను ది గోట్ మిగిల్చిందనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
విజయ్ రాజకీయాల్లో అడుగు పెట్టిన నేపథ్యంలో తమిళనాట ఈ సినిమాకి విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. తమిళనాట వచ్చిన పబ్లిసిటీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి మంచి బజ్ క్రియేట్ అయింది. కానీ ప్రేక్షకులు థియేటర్ కి వెళ్లి చూడాలి అనిపించేంత హిట్ అవ్వలేదు. యావరేజ్ టాక్ ను సొంతం చేసుకోగా, సోషల్ మీడియాలో సినిమా గురించి వచ్చిన రివ్యూలు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు తక్కువ నమోదు అవ్వడానికి కారణం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ సినిమా వల్ల మైత్రి వారికి కనీసం రూ.5 కోట్ల నష్టం వచ్చి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
'ది గోట్' సినిమాలో విజయ్ కి జోడీగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. తండ్రి, కొడుకు పాత్రల్లో విజయ్ కనిపించాడు. భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంటుందని భావించిన ది గోట్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర నిరాశ పరచగా, తమిళనాట మాత్రం నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్స్ కి లాభాలు తెచ్చి పెడుతుందనే సమాచారం అందుతోంది. విజయ్ గతంలో నటించిన సినిమాలూ తమిళనాట భారీ వసూళ్లు సాధించి తెలుగు రాష్ట్రాల్లో మినిమం వసూళ్లు సాధించలేకపోయాయి. అయినా ది గోట్ కి రూ.15 కోట్లు పెట్టడం అనేది తప్పు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రూ.10 కోట్ల తో ది గోట్ డబ్ వర్షన్ కొనుగోలు చేసి ఉంటే లాస్ తక్కువ ఉండేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నిర్మాతలు మైత్రి వారి నష్టాలను ఏమైనా పూడ్చుతారా అనేది చూడాలి.