అనిరుధ్, తమన్.. ఇప్పుడిదే హాట్ టాపిక్!

అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త చర్చ నడుస్తోంది. దేవర, గేమ్ ఛేంజర్ సినిమాల మ్యూజిక్ డైరెక్టర్స్ అనిరుధ్ రవిచందర్, తమన్ వర్క్ మధ్య కంపేరిజన్ చేస్తున్నారు

Update: 2024-10-10 01:30 GMT

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీతో టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్.. నేషనల్ వైడ్ గా ఎలాంటి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. దీంతో అందరి దృష్టి వారిద్దరి అప్ కమింగ్ చిత్రాలపై పడింది. తారక్.. ఇటీవల దేవర పార్ట్-1 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్నారు. రామ్ చరణ్ త్వరలో గేమ్ ఛేంజర్ మూవీతో థియేటర్లలో సందడి చేయనున్నారు

అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త చర్చ నడుస్తోంది. దేవర, గేమ్ ఛేంజర్ సినిమాల మ్యూజిక్ డైరెక్టర్స్ అనిరుధ్ రవిచందర్, తమన్ వర్క్ మధ్య కంపేరిజన్ చేస్తున్నారు. మ్యూజికల్ వర్క్ పరంగా తమన్, అనిరుధ్ మధ్య చాలా గ్యాప్ ఉందని చెబుతున్నారు. అలా అని తమన్.. మామూలు మ్యూజిక్ డైరెక్టర్ కాదని, అనేక సినిమాలకు సూపర్ అవుట్ పుట్ ఇచ్చారని అంటున్నారు. కానీ అనిరుధ్ వర్క్ ను అందుకోలేకోపోతున్నారని కామెంట్లు పెడుతున్నారు.

అందుకు ఎగ్జాంపుల్ కూడా చెబుతున్నారు. దేవర సినిమాలోని అన్ని పాటలు చార్ట్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. తొలి రెండు పాటలు ఫియర్ సాంగ్, చుట్టమల్లెకు వేరే లెవెల్ లో రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ అయ్యాక కూడా అదరగొట్టేశాయి. చాలా మంది ఫేవరెట్ లిస్ట్ లోకి చేరిపోయాయి. సోషల్ మీడియాలో రికార్డులు క్రియేట్ చేశాయి. కానీ గేమ్ ఛేంజర్ నుంచి రిలీజైన రెండు పాటలు.. దేవర సాంగ్స్ లా గుర్తింపు సంపాదించుకోలేదని చెప్పాలి.

మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకున్నా... దేవర పాటలంతా క్రేజ్ మాత్రం దక్కించుకోలేకపోయాయి. ఇప్పటికే అనేక టాలీవుడ్ సినిమాలకు అదిరిపోయేలా వర్క్ చేసిన తమన్.. గేమ్ ఛేంజర్ కు మాత్రం అనుకున్న స్థాయిలో మ్యూజిక్ అందించినట్లు కనపడటం లేదని నెటిజన్లు చెబుతున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న వేళ.. అనిరుధ్, రెహమాన్ తదితరులు చేస్తున్న వర్క్ లాగా అనిపించడం లేదని అంటున్నారు.

అదే సమయంలో తమన్.. టాలీవుడ్ టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అని కొనియాడుతున్నారు. గేమ్ ఛేంజర్ కు సాంగ్స్ విషయంలో కాకపోయినా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అదరగొడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. తన మార్క్ ను మరోసారి చూపిస్తారని ఆశిస్తున్నట్లు కామెంట్లు పెడుతున్నారు. మరి గేమ్ ఛేంజర్ మూవీకి గాను ఆయన వర్క్ ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్ది రోజుల పాటు వెయిట్ చేయాల్సిందే.

Tags:    

Similar News