విడాకుల‌కు కారణం చెప్పిన త‌మ‌న్!

తాజాగా త‌మ‌న్ ఓ ఇంట‌ర్వ్యూలో పెళ్లి గురించి, వైవాహిక వ్య‌వ‌స్థ గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు.

Update: 2025-02-08 06:09 GMT

సౌత్ సినీ ఇండ‌స్ట్రీలో మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. త‌మ‌న్ ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడుతూ, తాను చెప్పాల‌నుకున్న‌ది ఎలాంటి మొహ‌మాటాలు లేకుండా చాలా క్లారిటీగా చెప్తాడు. రీసెంట్ గా ఓ కార్య‌క్ర‌మంలో సినిమాల‌పై నెగిటివ్ రివ్యూలు, కామెంట్లు చేసే వారిపై ఆయ‌న మాట్లాడిన విధానం అంద‌రినీ ఆలోచింపజేసేలా ఉంది.

తాజాగా త‌మ‌న్ ఓ ఇంట‌ర్వ్యూలో పెళ్లి గురించి, వైవాహిక వ్య‌వ‌స్థ గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ఎవ‌రైనా త‌న‌ను పెళ్లి గురించి అడిగితే పెళ్లి చేసుకోవ‌ద్ద‌నే చెప్తాన‌ని చెప్పిన త‌మ‌న్, ఎందుకు అలా అంటున్నాడో కూడా వివ‌రించాడు. ఈ రోజుల్లో ఇద్ద‌రు క‌లిసి ఉండ‌టానికి పెళ్లి చాలా క‌ష్టంగా మారుతుంద‌ని, లైఫ్ లో అమ్మాయిలు కూడా ఇండిపెండెంట్ గా బ‌త‌కాల‌నుకుంటున్నారని అన్నాడు.

ఎవ‌రూ ఒక‌రి కింద బతకాల‌నుకోవ‌డం లేద‌ని, కోవిడ్ త‌ర్వాత అంద‌రూ మారిపోయార‌ని, అంద‌రి జీవ‌న విధానంలో ఊహించ‌ని మార్పులొచ్చాయ‌ని తెలిపాడు. అంతేకాదు, జ‌నాల్ని చెడగొట్ట‌డానికి ఇన్‌స్టాగ్ర‌మ్ కూడా ఒక మెయిన్ రీజ‌న్ అనిపిస్తుంద‌ని, సోష‌ల్ మీడియా వ‌ల్ల ఎన్నో చెడు ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయ‌ని త‌మ‌న్ వెల్ల‌డించాడు.

కేవ‌లం అంద‌మైన జ్ఞాప‌కాల‌ను మాత్ర‌మే మనం ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తున్నామ‌ని, కానీ దాని వెనుక ఉండే స్ట్ర‌గుల్ ను దాచేస్తున్నామ‌ని, అది చూసి బ‌య‌ట అంద‌రూ సంతోషంగానే ఉన్నారు నేను మాత్ర‌మే హ్యాపీగా లేను అనే ధోర‌ణిలో ఆలోచించ‌డం వ‌ల్లే గొడ‌వలై, విడాకుల వ‌ర‌కు వెళ్తున్నాయ‌ని, అంద‌రూ పెళ్లిలో పాజిటివ్ యాంగిల్ ను మాత్ర‌మే చూడ‌టానికి ట్రై చేస్తున్నార‌ని, కానీ ఎందులో అయినా పాజిటివ్ నెగిటివ్ ఉంటాయ‌ని, అందుకే ఎవ‌రైనా పెళ్లి గురించి అడిగితే చేసుకోవ‌ద్ద‌నే చెప్తానంటున్నాడు త‌మ‌న్.

ఈ రోజుల్లో ఎవ‌రూ పెళ్లి, పెళ్లి త‌ర్వాత ఉండే జీవితాన్ని అర్థం చేసుకోవ‌డానికి ట్రై చేయక‌పోవ‌డంతో మ్యారేజ్ సిస్ట‌మ్ అంద‌రికీ చాలా ట‌ఫ్ గా మారిపోయింద‌ని, అందుకే పెళ్లైన కొద్ది రోజుల‌కే విడాకులు తీసుకుంటున్నార‌ని, వైవాహిక జీవితంలోని మంచిని అర్థం చేసుకునేంత మెచ్యూరిటీ ఈ తరానికి లేవ‌ని త‌మ‌న్ తెలిపాడు.

ఇక సినిమాల విష‌యానికొస్తే రీసెంట్ గా బాల‌కృష్ణ తో క‌లిసి డాకు మ‌హారాజ్ సినిమాతో మంచి హిట్ అందుకున్న త‌మ‌న్, ప్ర‌స్తుతం ది రాజా సాబ్, ఓజీ, అఖండ‌2 తాండ‌వం, తెలుసు క‌దా సినిమాల‌కు ప‌ని చేస్తున్నాడు. త‌మ‌న్ కోసం మ‌రికొన్ని ప్రాజెక్టులు లైన్ లో ఉన్నాయి. ఓజీ, అఖండ‌2 సినిమాల‌పై అంద‌రికీ భారీ అంచ‌నాలున్నాయి.

Tags:    

Similar News