గేమ్ చేంజర్.. ఎవరు ఏమన్నా, అలా లేపేస్తున్న థమన్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్

Update: 2024-07-27 12:22 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్. ఈ సినిమాకి సంబంధించి మాగ్జిమమ్ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. మరో 15 రోజుల షెడ్యూల్ పెండింగ్ ఉందంట. రామ్ చరణ్ కి సంబంధించిన సీక్వెన్స్ అన్ని కూడా కంప్లీట్ పూర్తి చేసేశారు. ఇప్పుడు చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో చేయబోయే RC 16 చిత్రం కోసం రెడీ అవుతున్నారు. సెప్టెంబర్ లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే గేమ్ చేంజర్ సినిమాని డిసెంబర్ నెలలో క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నట్లు దిల్ రాజు ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు. ఓవైపు మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోంది. ప్యాచ్ వర్క్ సంబంధించిన షూట్ శంకర్ పూర్తి చేసి ప్యాకప్ చెప్పబోతున్నారు. ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి జరగండి జరగండి అనే లిరిక్స్ తో ఆడియో సాంగ్ రిలీజ్ అయ్యింది. హీరో, హీరోయిన్ మీద చిత్రీకరించిన ఈ సాంగ్ కి కాస్త నెగిటివ్ టాక్ కూడా వచ్చింది.

ఈ సాంగ్ కి ప్రభుదేవా మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. సాంగ్ విజువల్ చాలా కలర్ ఫుల్ గా ఉండబోతుందని బ్యాక్ డ్రాప్ చూస్తుంటే తెలుస్తోంది. ఎవరు ఎలా ట్రోల్ చేసినా ఈ సాంగ్ లో డ్యాన్స్ స్టెప్పులు కూడా అద్భుతంగా ఉండబోతున్నాయని తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎలివేషన్స్ ఇచ్చారు. ఓ మ్యూజికల్ రియాలిటీ షోలో థమన్ ఈ సాంగ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. జరగండి పాటని థియేటర్స్ లో చూసినప్పుడు ప్రేక్షకులు కచ్చితంగా విజిల్స్ వేస్తారని చెప్పుకొచ్చారు. సాంగ్ కోసం అదిరిపోయే హుక్ స్టెప్స్ ప్రభుదేవా మాస్టర్ కంపోజ్ చేశారని తెలిపారు.

అయితే ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది క్లారిటీ లేకపోవడంతో లిరికల్ సాంగ్ లో ఆ హుక్ స్టెప్స్ ని జోడించలేదని థమన్ స్పష్టం చేశారు. కచ్చితంగా ఈ సాంగ్ ఫుల్ ఎనర్జిటిక్ గా ప్రేక్షకులని ఎంగేజ్ చేస్తుందని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో కియరా అద్వానీ హీరోయిన్ గా నటించింది. మూవీలో రామ్ చరణ్ తండ్రి కొడుకులుగా రెండు విభిన్న పాత్రలలో కనిపించబోతున్నారు. తండ్రి పాత్ర ఒక పొలిటికల్ లీడర్ గా ఉండబోతుందంట. ఆ క్యారెక్టర్ కి జోడిగా అంజలి నటించిందని తెలుస్తోంది.

ఎస్ జె సూర్య ఈ చిత్రంలో ప్రతి నాయకుడిగా కనిపించబోతున్నారు. కంప్లీట్ కమర్షియల్ జోనర్ లోనే ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. శంకర్ భారతీయుడు 2 సినిమాతో డిజాస్టర్ అందుకున్నారు. ఈ నేపథ్యంలో గేమ్ చేంజర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకొని బౌన్స్ బ్యాక్ అవ్వాలని భావిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నుంచి పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న సినిమా ఇదే కావడంతో ఫ్యాన్స్ కూడా చాలా హోప్స్ పెట్టుకున్నారు.

Tags:    

Similar News