త్రివిక్రమ్ - పూనమ్ కపూర్.. తమ్మారెడ్డి ఏమన్నారంటే..
ప్రస్తుతం టాలీవుడ్ లో జానీ మాస్టర్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం టాలీవుడ్ లో జానీ మాస్టర్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో ఒక ఇంటర్నల్ కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపడుతుందని మంగళవారం ప్రెస్ మీట్ పెట్టి కన్ఫర్మ్ చేశారు. రెండు వారాల క్రితమే ఈ కేసు తమ పరిధిలోకి వచ్చిందని, అప్పటి నుంచి విచారణ జరుగుతుందని అన్నారు. మరోవైపు జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసుపై నార్సింగి పోలీసులు విచారణ వేగవంతం చేశారు.
ఇందులో అన్ని కోణాలలో ఇన్వెస్టిగేషన్ చేస్తూ వాస్తవాలు తెలుసుకునే పనిలో ఉన్నారు. లైంగికవేధింపులు నిజమని నిర్ధారణకి వస్తే జానీ మాస్టర్ ని అరెస్ట్ చేసే అవకాశం ఉందనే మాట మీడియా సర్కిల్ లో వినిపిస్తోంది. ఈ వ్యవహారం ఇలా నడుస్తూ ఉండగానే ఒకప్పటి హీరోయిన్ పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి హైలైట్ చేసింది. గతంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ పై కంప్లైంట్ చేశానని పూనమ్ కౌర్ తెలిపింది.
అయితే నా ఫిర్యాదుని అప్పుడు ఎవరు పనిగణలోకి తీసుకోలేదని పూనమ్ కౌర్ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ కాస్తా వైరల్ కావడంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ పైన సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ మొదలయ్యాయి. దీనిపై ఫిల్మ్ ఛాంబర్ తరపున తమ్మారెడ్డి భరద్వాజ రియాక్ట్ అయ్యారు. పూనమ్ కౌర్ ఎప్పుడు, ఎవరికి ఫిర్యాదు చేసిందో తమ దృష్టికి రాలేదని క్లారిటీ ఇచ్చారు. నిజంగా ఆమెకి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఏదైనా సమస్య ఉంటే ఫిల్మ్ ఛాంబర్ లో లిఖిత పూర్వకంగా కంప్లైంట్ చేయొచ్చని సూచించారు.
అలాగే ఫిల్మ్ ఛాంబర్ వద్ద ఉన్న కంప్లైంట్ బాక్స్ లో వేసిన కూడా పరిశీలిస్తామని అన్నారు. లైంగిక వేధింపుల సమస్యని పరిష్కరించడానికి ఫిల్మ్ ఛాంబర్ ప్రత్యేకంగా ఒక సెల్ ని ఏర్పాటు చేసిందని, అది యాక్టివ్ గా పనిచేస్తుందని చెప్పారు. పూనమ్ కౌర్ అక్కడ ఫిర్యాదు చేయొచ్చని తమ్మారెడ్డి భరద్వాజ సలహా ఇచ్చారు. అయితే ఆయన సలహా బాగానే ఉన్న కూడా పూనమ్ కౌర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు ట్విట్టర్ లో చేయలేదు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఫిర్యాదు చేశానని చెప్పింది కానీ అది ఏ విషయంపై అనేది పూనమ్ కౌర్ ప్రస్తావించలేదు. చాలా కాలంగా పూనమ్ కౌర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై పరోక్షంగా విమర్శలు చేస్తోంది. తనకి అవకాశాలు దూరం కావడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ కారణమనే విధంగానే ఆమె కామెంట్స్ ఉన్నాయి ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఫిర్యాదు చేసినట్లు ట్విట్టర్ లో డైరెక్ట్ గా ప్రస్తావించింది. అయితే ఆమె లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు ఎక్కడా కూడా పేర్కొనలేదనే మాట వినిపిస్తోంది. తమ్మారెడ్డి సలహాపై పూనమ్ కౌర్ ఎలా రియాక్ట్ అవుతుందనేది వేచి చూడాలి.