తండేల్ సంక్రాంతి టార్గెట్.. ఆ సినిమాకు చాలెంజే..
ముఖ్యంగా గేమ్ ఛేంజర్ సినిమాకు ఒక ప్రధానమైన ఛాలెంజ్ గా తండేల్ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.
నాగచైతన్య తండేల్ సినిమా మొదట క్రిస్మస్ కు రావడానికి ఒక ప్లాన్ సెట్ చేసుకున్న విషయం తెలిసిందే. దానికి తగ్గట్టుగానే సినిమా షూటింగ్ పనులు అప్డేట్స్ ప్రమోషన్స్ కూడా కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడు హఠాత్తుగా తండేల్ సంక్రాంతిని టార్గెట్ చేసిందని వార్తలు రాగానే ఒక్కసారిగా విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇంకా ఈ విషయంపై అఫీషియల్ క్లారిటీ రాకపోయినప్పటికీ కూడా తండేల్ టీమ్ సంక్రాంతికి రావడానికి ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.
అయితే ఇప్పటికే సంక్రాంతికి రాబోతున్న సినిమాలు ఒక డేట్ అయితే ఫిక్స్ చేసుకున్నాయి. ముందుగా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సంక్రాంతిలో అత్యధిక థియేటర్లో విడుదల కాబోతోంది. మరోవైపు నందమూరి బాలకృష్ణ 109వ సినిమా అలాగే వెంకటేష్ అనిల్ రావిపూడి సినిమా ఇదే టైంలో రిలీజ్ కాబోతున్నాయి. ఈ సినిమాలు వేటికవే భిన్నంగా ఉండబోతున్న విషయం తెలిసిందే.
సాధారణంగా సంక్రాంతి అనగానే నాలుగైదు సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. కంటెంట్ బాగున్న సినిమాలు పోటీతో సంబంధం లేకుండా మంచి కలెక్షన్స్ కూడా అందుకుంటూ ఉంటాయి. అంతగా పాజిటివ్ టాక్ తెచ్చుకోలేని సినిమాలు కూడా సంక్రాంతి టైమ్ లో డిస్ట్రిబ్యూటర్లను సేఫ్ జోన్ లో పడేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అయితే ఇప్పుడు ఈ సంక్రాంతి క్లాష్ లో బాలయ్య, వెంకటేష్ సినిమాలకు హై రేంజ్ పాజిటివ్ వైబ్ లేకున్నా గేమ్ ఛేంజర్ అంత ననెగిటివ్ వైబ్ అయితే లేదు. ముఖ్యంగా గేమ్ ఛేంజర్ సినిమాకు ఒక ప్రధానమైన ఛాలెంజ్ గా తండేల్ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే గేమ్ ఛేంజర్ కంటే ఈ సినిమాపైనే పాజిటివ్ బజ్ ఎక్కువగా ఉంది. కార్తికేయ 2 సక్సెస్ తో చందు మొండేటి, సాయి పల్లవి నాగచైతన్య కాంబినేషన్ వంటి అంశాలతోనే సినిమాకు ముందుగానే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి.
అందులోనూ గీతా ఆర్ట్స్ పై బన్నీ వాసు సినిమాను క్వాలిటీగా నిర్మిస్తున్నాడు. మత్స్యకారుల నిజ జీవితంలోని సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరపైకి రాబోతోంది. చాలా అంశాలు ఈ సినిమాకు పాజిటివ్ గా ఉన్నాయి. అయితే గేమ్ చేజర్ మాత్రం ఇప్పటివరకు ఫ్యాన్స్ లో ఒక బలమైన నమ్మకాన్ని అయితే క్రియేట్ చేయలేకపోయింది. అసలే ఇండియన్ 2 డిజాస్టర్ వల్ల శంకర్ కు క్రేజ్ తగ్గింది. ఇక అప్డేట్స్ వస్తున్నా కూడా అవేమీ అంతగా క్లిక్ అయితే కాలేదు. ఇక తండేల్ సినిమా క్లిక్ అయితే మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా ఈ సినిమా వైపు ఎక్కువగా యూ టర్న్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి గేమ్ ఛేంజర్, తండేల్ తో పోటీ పడితే బలమైన టాక్ అందుకోవాల్సిన అవసరం ఉంటుంది.