తండేలో తో కార్తికేయ సెలబ్రేషన్స్.. వ్వాటే మూమెంట్స్
ఇదిలా ఉంటే ఇప్పుడు నిఖిల్ పాన్ ఇండియా లెవల్ లో ది ఇండియన్ హౌస్, స్వయంభు అనే రెండు సినిమాలు చేస్తున్నారు.
నిఖిల్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన కార్తికేయ 2 పాన్ ఇండియా రేంజ్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. మూవీ ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్ ని అందుకొని రికార్డ్ సృష్టించింది. ఈ మూవీతో నిఖిల్ ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. డైరెక్టర్ చందూ మొండేటి క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు నిఖిల్ పాన్ ఇండియా లెవల్ లో ది ఇండియన్ హౌస్, స్వయంభు అనే రెండు సినిమాలు చేస్తున్నారు.
అలాగే చందూ మొండేటి అక్కినేని నాగ చైతన్యతో తండేల్ సినిమాని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ప్రెజెంట్ చేయబోతున్నారు. సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని మిరాయ్ అనే సూపర్ హీరో మూవీని దర్శకుడిగా తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే 70వ జాతీయ సినీ అవార్డులలో కార్తికేయ 2 చిత్రాన్ని బెస్ట్ తెలుగు ఫిల్మ్ గా ఎంపిక చేశారు. ఈ సినిమాకి నేషనల్ అవార్డు రావడంతో ఇప్పుడు టీమ్ మొత్తం సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నారు.
ఇప్పటికే ఈ సినిమాలో భాగం అయిన అందరూ కూడా ట్విట్టర్ ద్వారా తమ సంతోషాన్ని షేర్ చేసుకున్నారు. ఇక శనివారం రాత్రి కార్తికేయ 2 టీమ్ మొత్తం అవార్డు విన్నింగ్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇందులో నిర్మాతలైన టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, అలాగే హీరో నిఖిల్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, డైరెక్టర్ చందూ మొండేటి, సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని, అలాగే కమెడియన్ వైవా హర్ష పాల్గొన్నారు.
చందూ మొండేటి ప్రస్తుతం తండేల్ మూవీ షూట్ లో ఉండటంతో ఆ మూవీ హీరో నాగ చైతన్య, నిర్మాత అల్లు అరవింద్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కూడా ఈ ఈవెంట్ లో పాల్గొని కార్తికేయ 2 టీమ్ కి అభినందనలు తెలియజేశారు. ఇక ఈ సెలబ్రేషన్ మూమెంట్ కి సంబందించిన ఫోటోలని టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి కాస్తా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కార్తికేయ 2 టీమ్ సమిష్టి కృషితో సాధించిన విజయంగా దీనిని కొనియాడుతున్నారు.
కంటెంట్ ఉన్న కథలకి కమర్షియల్ సక్సెస్ లు లభించడమే కాకుండా అవార్డులు కూడా వస్తాయని కార్తికేయ 2 ప్రూవ్ చేసింది. బాహుబలి సిరీస్ తర్వాత నేషనల్ లెవల్ అవార్డులలో తెలుగు సినిమాలకి ప్రాధాన్యత పెరిగింది. 69వ నేషనల్ అవార్డుల వేడుకలో ఆర్ఆర్ఆర్ మూవీ అత్యధిక జాతీయ అవార్డులని అందుకుంది. అలాగే అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా పుష్ప సినిమాకిగాను ఎంపికయ్యారు. ఇప్పుడు కార్తికేయ 2కి నేషనల్ బెస్ట్ తెలుగు మూవీ అవార్డు వచ్చింది. వచ్చే ఏడాది కల్కి, హనుమాన్ సినిమాలు నేషనల్ అవార్డుల కేటగిరీలో ఉంటాయనే మాట వినిపిస్తోంది.