దిగ్గ‌జ ఓటీటీల విలీనం అందుకే ఆల‌స్యం?

భార‌త‌దేశంలో అత్యంత భారీ మ‌ల్టీప్లెక్స్ చైన్ ఎదుగుద‌లకు సంబంధించిన ఈ డీల్ ఆస‌క్తిని క‌లిగించింది.

Update: 2024-01-01 17:30 GMT

పీవీఆర్ - ఐనాక్స్ మెర్జింగ్ ఇటీవ‌ల చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇవి రెండూ విడివిడిగా ప్ర‌ముఖ సంస్థ‌లు. వీటి మెర్జింగ్ (విలీనం)తో పీవీఆర్ ఐనాక్స్ ఉమ్మ‌డి సంస్థ‌ ఎంతో బ‌ల‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. భార‌త‌దేశంలో అత్యంత భారీ మ‌ల్టీప్లెక్స్ చైన్ ఎదుగుద‌లకు సంబంధించిన ఈ డీల్ ఆస‌క్తిని క‌లిగించింది. థియేట్రిక‌ల్ రంగాన్ని శాసించే స‌త్తా ఈ చైన్ వ్య‌వ‌స్థ‌కు ఉంది.

ఇప్పుడు ఇదే తీరుగా ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ‌లు జీ - సోనీ విలీనం ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. రెండు బ‌ల‌మైన సంస్థ‌లు ఏకీకృతం అయితే మెజారిటీ మార్కెట్ వాటాను కైవ‌శం చేసుకోవ‌డం సాధ్య‌మ‌వుతుంది. అయితే ఈ ఒప్పందం కొన్ని వాయిదాల‌తో ఇబ్బందిక‌ర స‌న్నివేశాన్ని ఎదుర్కొంటోంది. నిజానికి 2023 చివరి నాటికి మెర్జింగ్ ప్ర‌క్రియ‌ పూర్తి చేయాలని ప్లాన్ చేసినా కానీ అది సాధ్య‌ప‌డ‌లేదు. ఈ ఒప్పందం విలువ సుమారు 10 బిలియన్ల డాల‌ర్లు. కానీ ఈ డీల్ లో ర‌క‌ర‌కాల‌ సమస్యలు ఉన్నాయి. జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL)- సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ ఇండియా (ప్రస్తుతం కల్వర్ మ్యాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్) చట్టపరమైన సమస్యలు జాప్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

వాస్త‌వానికి ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క ఒప్పంద ప్ర‌క్రియ సెప్టెంబరు 2023కి పూర్తి కావాల్సి ఉంది. కానీ అనుకున్న స‌మ‌యంలో ఇది పూర్తి కాక‌పోవ‌డంతో డీల్ ని డిసెంబర్ 22కి పొడిగించారు. కానీ క్యాలెండ‌ర్ ఇయ‌ర్ మారింది. కొత్త సంవ‌త్స‌రంలో అడుగుపెట్టాం. ఇప్పుడు అది ఎప్ప‌టికి పూర్త‌వుతుందో తెలీని ప‌రిస్థితి. కొందరు ఫిబ్రవరి 2024 నాటికి పూర్త‌వుతుంద‌ని చెబుతుంటే మరికొందరు ఏప్రిల్ 2024కి ముందు పూర్త‌వుతుందో లేదో అనే సందేహాల్ని వ్య‌క్తం చేస్తున్నారు.

ఇరు సంస్థ‌ల ఆర్థిక బ‌లాలు పరిశీలిస్తే.. సోనీ క‌ల్వ‌ర్ మ్యాక్స్ ఎంట‌ర్ టైన్ మెంట్ ప్ర‌.లిమిటెడ్ కి రూ.6684.9 కోట్ల ఆదాయం గత ఏడాదిలో వచ్చింది. సోని సంస్థ‌ 26 ఛానెల్‌లను నిర్వ‌హిస్తుండ‌గా, సోనిLIV- సోని స్టూడియో ఇందులో ప్ర‌ముఖ‌మైన‌వి. దీనితో పోలిస్తే జీ గ్రూప్ సంస్థ‌ల బ‌లం పెద్ద‌ది. ZEEL గ‌త ఏడాది నాటికి రూ. 8087.9 కోట్ల ఆదాయాన్ని కలిగి ఉంది. 50 ఛానెల్‌లు నిర్వ‌హిస్తోంది. ఇందులో జీ5, జీ స్టూడియోస్, జీ మ్యూజిక్ ఎంతో పాపుల‌ర్. ప్ర‌స్తు విలీనం ప్ర‌క్రియ పూర్త‌యితే సంయుక్త కంపెనీలు 70 ప్ల‌స్ TV ఛానెల్‌లను ప్ర‌జ‌ల‌కు అందించ‌గ‌ల‌వు. జీ5, సోని LIV అలాగే ఫిల్మ్ స్టూడియోలతో అతి పెద్ద ఏకీకృత సంస్థ‌గా ఆవిష్కృత‌మ‌వుతుంది. ఇది మార్కెట్‌లో 26 వాతం వాటాను నియంత్రించ‌గ‌ల‌దు. ప్ర‌జ‌లు లేదా వినియోగ‌దారుల‌కు ఒకే వేదిక‌పై వినోదం రెట్టింప‌వుతుంద‌ని అంచ‌నా.

Tags:    

Similar News