టీజర్ టాక్: ఎమోషనల్ గర్ల్ ఫ్రెండ్
వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న నేషనల్ క్రష్ ఇప్పుడు ‘ది గర్ల్ ఫ్రెండ్’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో రాబోతుంది.
ప్యాన్ ఇండియా రేంజ్ లో వరుస బాక్సాఫీస్ సక్సెస్ లతో దూసుకుపోతున్న రష్మిక మందన్న కేవలం బిగ్ బడ్జెట్ సినిమాలను మాత్రమే కాకుండా మంచి కంటెంట్ ఉన్న చిన్న బడ్జెట్ సినిమాలను కూడా చేస్తోంది. రష్మిక మందన్న ఇటీవల పుష్ప 2 సక్సెస్ తో ఫుల్ హ్యాపీగా ఉంది. వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న నేషనల్ క్రష్ ఇప్పుడు ‘ది గర్ల్ ఫ్రెండ్’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో రాబోతుంది.
ప్రముఖ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై అల్లు అరవింద్, మారుతి నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతుండగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. కన్నడ యువ హీరో దీక్షిత్ శెట్టి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక లేటెస్ట్ గా సినిమాకు సంబంధించిన టీజర్ ను విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో విడుదల చేశారు. అందులో విజయ్ వాయిస్ ఓవర్ తో రష్మిక క్యారెక్టర్ ను ఒక కవిత తరహాలో హైలెట్ చేశారు.
కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో క్యాంటీన్, క్లాస్ రూమ్, స్నేహితులు అలాగే ప్రేమ సన్నివేశాలు ఆ తరువాత వారి మధ్య వచ్చే అపార్ధాలను సినిమాలో చూపించనున్నట్లు అర్ధమవుతుంది. స్టోరీ లైన్ మాత్రం మునుపెన్నడూ చూడని విధంగా ఉంటుందని తెలుస్తోంది. నయనం నయనం.. అంటూ విజయ్ ఇచ్చిన వాయిస్ ఓవర్ కంటెంట్ ను హైలెట్ చేస్తోంది. ఇక హేశం అబ్దుల్ బ్యాక్ గ్రౌండ్ సాంగ్ మ్యూజిక్ కూడా ఫీల్ గుడ్ తరహాలో ఉంది.
రష్మిక ఒక కాలేజ్ అమ్మాయి తరహాలో చాలా క్యూట్ గా కనిపిస్తోంది. ఆమె ఇదివరకు చేసిన పాత్రలకంటే కూడా ఈ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే చాలా ఎమోషనల్ డెప్త్ ఉన్న స్టోరీ లైన్ అని అర్ధమవుతుంది. దర్శకుడు రాహుల్ ఇదివరకే చిలసౌ సినిమాలో కూడా భావోద్వేగ సన్నివేశాలతో ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాలోని సీన్స్ కూడా మరీంత హైలెట్ కానున్నట్లు అర్ధమవుతుంది.
ఇదివరకే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, గ్లింప్స్ రిలీజ్ చేయగా పాజిటివ్ బజ్ అందుకుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా యూనిట్ మిగిలిన వర్క్ ను వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలని చూస్తోంది. అలాగే రిలీజ్ డేట్ పై కూడా త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు.