ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇదేనా!
తాజాగా ఇటీవలే అర్జున్ కపూర్ నటించిన `ది లేడీ కిల్లర్` అనే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా బడ్జెట్ 45 కోట్లు .
భారీ బడ్జెట్ చిత్రాలు ఎన్నో అంచనాల మధ్య విడుదలై బోల్తా కొట్టిన సందర్బాలెన్నో. సినిమాకి తొలి షో అనంతరం ప్లాప్ టాక్ వచ్చిందంటే? ఆ థియేటర్ వైపు ప్రేక్షకుడు చూసే పరిస్థితి ఉండదు. అందుకు పెద్ద స్టార్..చిన్న స్టార్ అనే మినహాయింపు ఏమీ ఉండదు. బొమ్మ పడిన తర్వాత హిట్ టాక్ తెచ్చుకుంటేనే జనాలు థియేటర్ వెళ్లేది. లేదంటే? ప్లాప్ సినిమా టైంపాస్ గా ఓటీటీలో చూసుకుందాం లే అనే లెక్కలో ఆడియన్స్ ఉన్నారు.
ఇప్పుడు ఎంత పెద్ద అభిమాని అయినా సరే? టికెట్ కొనే ముందు అది వర్త్ నా? కాదా? అని లోచించి కొంటున్నాడు. అందుకు పరోక్షంగా ఓటీటీ కూడా ఓ కారణం అనుకోండి. అందుకే నిర్మాతలు తొలి వారంలోనే వసూళ్లు లాగేసేలా ఎక్కువ స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారు. వస్తే ఆ వారంలో రావడం. లేదంటే? దుకాణం సర్దేయడం అన్నట్లే సన్నివేశం ఉంది. తాజాగా ఇటీవలే అర్జున్ కపూర్ నటించిన `ది లేడీ కిల్లర్` అనే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా బడ్జెట్ 45 కోట్లు .
మరి కలెక్షన్ ఎంతో తెలుసా? తెలిస్తే షాక్ అవుతారు. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. అక్షరాలా 50 వేలు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా మొదటి ఆటతోనే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో జనాలు థియేటర్ కి వెళ్లలేదు. ఆలస్యం అమృతం విషం అన్నట్లు ఓటీటీలో కూడా త్వరగానే రిలీజ్ అయింది. దీంతో అక్కడే కపూర్ బోయ్ అభిమానులు చూసి ఆస్వాదించారు. ఈ సినిమా గత ఏడాది నవంబర్ లో రిలీజ్ అయింది.
భారతీయ చిత్ర పరిశ్రమలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. తీస్తే ఇలాంటి సినిమాల జాబితా ఇంకా చాలానే ఉంటుంది. అసలు లెక్కలు తీస్తే బాక్సాఫీస్ లెక్కల్లో బొక్కలు చాలా బయట పడతాయి. ఇటీవలే ఓ తెలుగు సినిమా కూడా రిలీజ్ అయింది. ఆ సినిమా బడ్జెట్ 5 కోట్లు అన్నారు. కానీ కలెక్షన్లు రాలేదని ఓపెన్ గానే సదరు నిర్మాతలు చెప్పారు.