వేధింపులు భరించలేక ఉరి వేసుకున్న నటుడు చివరికి..!
అతను `ది హంగర్ గేమ్స్: క్యాచింగ్ ఫైర్స్ .. ఫాస్ట్ ఎక్స్ వంటి చిత్రాలలోను నటించాడు.
తాను పదేపదే లైంగిక వేధింపులు భరించిన తర్వాత డిప్రెషన్‌లోకి వెళ్లానని.. బైపోలార్ డిసీజ్‌తో బాధపడుతున్నానని వెల్లడించారు ప్రముఖ హాలీవుడ్ నటుడు, `రీచర్` ఫేం అలాన్ రిచ్సన్. తాను మోడలింగ్ రంగంలో ఉన్నప్పటి నుంచి ఈ దాడి మొదలైందని, నటనకు మారిన తర్వాత కూడా తనపై లైంగిక దాడి జరిగిందని అతడు చెప్పాడు. ``ఒత్తిడి తట్టుకోలేక నేను ఉరి వేసుకున్నాను`` అని హాలీవుడ్ రిపోర్టర్‌తో చెప్పాడు. బ్లాక్ అవుట్ (చావు దరికి చేరే) అయ్యే ముందు చివరి క్షణంలో తనను తాను పైకి లాగినట్లు చెప్పాడు. అలాన్ రిచ్సన్ ప్రస్తుతం `రీచర్`లో జాక్ రీచర్ అనే టైటిల్ క్యారెక్టర్‌లో నటిస్తున్నాడు. అతను `ది హంగర్ గేమ్స్: క్యాచింగ్ ఫైర్స్ .. ఫాస్ట్ ఎక్స్ వంటి చిత్రాలలోను నటించాడు.
హాలీవుడ్ రిపోర్టర్‌తో అలాన్ రిచ్ సన్ మాట్లాడుతూ.. మోడలింగ్ పరిశ్రమలో పనిచేయడానికి చాలా తక్కువ రిడీమ్ లక్షణాలు ఉన్నాయి. నిజాయితీగా చెప్పాలంటే ఇది చట్టబద్ధమైన సెక్స్ ట్రాఫికింగ్ లాంటిది. పరిశ్రమ ఎవరి నియంత్రణలోను ఉండదు. ఇది చాలా మందికి తెలిసిన రహస్యం. ఉద్యోగంలో నియమితులయ్యాక... ప్రాథమికంగా అక్రమ రవాణా కోసం ఫోటోగ్రాఫర్ దగ్గరకు పంపుతారు! అని తెలిపాడు. లైంగిక వేధింపులే లక్ష్యంగా ఉన్న భయంకరమైన వాతావరణంలో నన్ను ఎన్నిసార్లు ఉంచారు. జీవించడానికి మీరు కోరుకున్న జీతం- క్యారెట్ అనుకుంటే, నేను రెండు చేతులతో లెక్కించలేను. అది తరచూ... జరిగేది! అని అతడు తన మోడలింగ్ రోజులను గుర్తు చేసుకున్నాడు.
నేను ఓ పాపులర్ ఫోటోగ్రాఫర్ తో షూటింగ్ కోసం బుక్ అయ్యాను. అతడు ఒక మ్యాగజైన్ కోసం చాలా లాభదాయకమైన ప్రచారాన్ని ఇస్తానని హామీ ఇవ్వడంతో నన్ను నగ్నంగా షూట్ చేయడానికి హోటల్ గదిలోకి పంపారు. అతడు నన్ను లైంగికంగా వేధించాడు అని తెలిపాడు రిచ్ సన్.
సినిమా ఫండ్ కోసం భాగస్వామిగా ఉన్న ఒక వ్యక్తి నటనా ప్రపంచంలోకి ఆహ్వానించి ఇదే చేసిందని అన్నాడు. ఆమె నన్ను తన గదికి రమ్మని అల్టిమేటం ఇచ్చింది. నేను అలా చేయకపోతే నా అవకాశాలను నాశనం చేస్తానని .. నేను తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డానని క్లెయిమ్ చేస్తానని .. మీడియాకి కాల్ చేసి నన్ను నాశనం చేస్తానని చెప్పింది.. అని ఆవేదన చెందాడు.
ఉరివేసుకుని తన జీవితాన్ని అంతం చేసుకునేందుకు ప్రయత్నించినట్లు నటుడు రిచ్ సన్ తెలిపాడు. కానీ చివరి క్షణంలో తనను తాను పైకి లాగగలిగాడు. 30 ఏళ్ల మధ్యలో ఇంకా యుక్తవయస్సులో ఉన్న తన కుమారులు కాలెమ్, ఈడాన్, అమోరీలను చూసిన తర్వాత అతడు ఆత్మహత్య నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అతడు సంఘటన తర్వాత సహాయం కూడా కోరాడు. తరువాత 36 సంవత్సరాల వయస్సులో తనకు బైపోలారిటీ .. 40 సంవత్సరాల వయస్సులో ADHD ఉన్నట్లు నిర్ధారణ అయిందని తెలిపాడు.
అదే ఇంటర్వ్యూలో అతడు ఇలా అన్నాడు.``సృష్టికర్త ఉన్నాడని మనం సృష్టించబడిన జీవులమని నమ్మే వ్యక్తిగా నేను జీవితం అర్థం పరమార్థం ఉద్దేశ్యం గురించి వెనక్కి తగ్గుతూనే ఉన్నాను. అర్హతలు లేకుండా మన జీవితంలో మన ఉద్దేశ్యం ఎలా ఉన్నా కానీ, ప్రపంచం మంచి ప్రదేశం.. ఇతరులకు సేవ చేయండి. అదే జీవితం అంటే`` అని వ్యాఖ్యానించాడు.