ఈ వీక్ అంతా చిన్న చిత్రాలదే.. ఓటీటీల్లోకి క్రేజీ కంటెంట్..

థియేటర్లలో దీపావళి కానుకగా విడుదలైన క, లక్కీ భాస్కర్, అమరన్ సినిమాలు అదరగొడుతున్నాయి.

Update: 2024-11-04 09:24 GMT

థియేటర్లలో దీపావళి కానుకగా విడుదలైన క, లక్కీ భాస్కర్, అమరన్ సినిమాలు అదరగొడుతున్నాయి. భారీ వసూళ్లను సాధిస్తూ సత్తా చాటుతున్నాయి. లాంగ్ వీకెండ్ కలిసి రావడంతో ఓ రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టాయి. బ్రేక్ ఈవెన్ టార్గెట్ చేరువలోకి వెళ్లిపోయాయి. మరికొన్ని రోజులపాటు సత్తా చాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతలో ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యేందుకు వివిధ చిత్రాలు రెడీ అయిపోయాయి. ఓటీటీల్లోకి ఇంట్రెస్టింగ్ కంటెంట్ రానుంది. ఆ పూర్తి వివరాలు మీకోసం..

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ధాం ధాం మూవీ.. నవంబర్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సాయి కిషోర్ తెరకెక్కించిన ఆ సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఆ మూవీ.. ప్రమోషనల్ కంటెంట్ ద్వారా పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకుంది. మరోవైపు, యంగ్ హీరో నిఖిల్ సర్ప్రైజ్ మూవీ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ఆ రోజే రిలీజ్ కానుంది. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా థియేటర్లలోకి రానుంది.

రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల మూవీతో హిట్ అందుకున్న డైరెక్టర్ విరించి వర్మ.. ఇప్పుడు కొంత గ్యాప్ తర్వాత పొలిటికల్‌ థ్రిల్లర్ జోనర్ లో జితేందర్‌ రెడ్డి సినిమాను తెరకెక్కించారు. బాహుబలి ఫేమ్ రాకేశ్ వర్రే హీరోగా నటించిన ఆ సినిమా కూడా నవంబర్ 8నే రిలీజ్ అవ్వనుంది. అదే రోజు సతీష్‌బాబు రాటకొండ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న జాతర చిత్రం కూడా రిలీజ్ కానుంది.

సైన్స్‌ ఫిక్షన్‌ అండ్ మైథలాజికల్‌ థ్రిల్లర్‌ రహస్యం ఇదం జగత్‌ మూవీపై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. రాకేష్ గలేబి, స్రవంతి నటించిన ఆ సినిమాను కోమల్‌ ఆర్‌. భరద్వాజ్‌ తెరకెక్కించారు. నవంబర్ 8న రిలీజ్ కానుందీ చిత్రం. ఈ సారైనా?, వంచన, జ్యూయల్‌ థీఫ్‌ కూడా అదే రోజు విడుదల కానున్నాయి. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ బ్లడీ బెగ్గర్‌ తెలుగు వెర్షన్.. నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు, ఓటీటీల్లోకి రానున్న ప్రాజెక్టుల వివరాలు ఇలా..

నెట్‌ ఫ్లిక్స్‌ లో నవంబరు 6న మీట్‌ మీ నెక్ట్స్‌ క్రిస్మస్‌ (హలీవుడ్‌), నవంబర్ 7న అవుటర్‌ బ్యాంక్స్‌ 4 (వెబ్‌ సిరీస్‌) అందుబాటులోకి రానున్నాయి. 8వ తేదీన మిస్టర్‌ ప్లాంక్‌టన్‌ (కొరియన్‌), ది బకింగ్‌ హామ్‌ మర్డర్స్‌ (హిందీ), ఉమ్జోలో (హాలీవుడ్‌), వేట్టయాన్‌ (తెలుగు), విజయ్‌ 69 (హిందీ) స్ట్రీమ్ అవ్వనున్నాయి.

మరోవైపు, అమెజాన్‌ ప్రైమ్‌ లో సిటాడెల్‌: హనీ బన్నీ వెబ్ సిరీస్ నవంబరు 7న స్ట్రీమింగ్ కు రానుంది. కౌంట్‌ డౌన్‌: పాల్‌ వర్సెస్‌ టైసన్‌ వెబ్‌ సిరీస్‌ అదే రోజు అందుబాటులోకి రానుంది.

జియో సినిమాలో డిస్పికబుల్‌ మీ 4 (తెలుగు) నవంబర్ 5న, డిస్నీ + హాట్‌ స్టార్‌ లో ఎక్స్‌ ప్లోరర్‌ : ఎండ్యూరన్స్‌ (హలీవుడ్‌) నవంబరు 3న, అజయంతే రందం మోషనమ్‌ (మలయాళం) నవంబరు 8న అందుబాటులోకి రానున్నాయి.

ఆహాలో జనక అయితే గనక మూవీ నవంబరు 8 నుంచి, బుక్‌ మై షోలో ట్రాన్స్‌ఫార్మర్స్‌ వన్‌ (యానిమేషన్‌) నవంబరు 6 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి.

Tags:    

Similar News