.consent-eea { display:none; } .consent-ccpa{ display:none; } .amp-geo-group-eea .consent-eea { display:block; } .amp-geo-group-ccpa .consent-ccpa { display:block; }

ది బర్త్ డే బాయ్ టీజర్.. అల్లరే అల్లరి!

ఇక ఫారిన్ లో చదువుకోవడానికి వెళ్లిన యూత్ కుర్రాళ్ళ లైఫ్ స్టైల్ నేపథ్యంలో కథ ఉన్నట్లు కనిపిస్తోంది. ఐదుగురు ఫ్రెండ్స్, వారి చేసే బర్త్ డే పార్టీ అల్లరితో టీజర్ ని కట్ చేశారు.

Update: 2024-07-01 11:54 GMT

ఈ మధ్య కాలంలో యూత్ ఇంటరెస్టింగ్ ఐడియాస్ తో కాంటెంపరరీ కథలతో ఎంటర్టైన్మెంట్ జోనర్ లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులని మెప్పిస్తున్నారు. ముఖ్యంగా యూత్ కి కనెక్ట్ అయ్యే థాట్స్ ని కథావస్తువుగా మార్చి తెరపై ఆవిష్కరిస్తున్నారు. గత ఏడాది మేము ఫేమస్ అంటూ ఓ చిన్న సినిమా వచ్చి మంచి టాక్ సొంతం చేసుకుంది. కంటెంట్ లో దమ్ముంటే బడ్జెట్ ఎంత అనేది ఆడియన్స్ చూడడని బలగం లాంటి సినిమాలు ప్రూవ్ చేశాయి.

 

అలాంటి కోవలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో కామెడీ డ్రామాగా వస్తోన్న సినిమా ది బర్త్ డే బాయ్. ఈ మూవీ టీజర్ తాజాగా రిలీజ్ అయ్యింది. విస్కీ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. బొమ్మ బొరుసు ప్రొడక్షన్స్ ఈ మూవీని నిర్మించింది. డైరెక్టర్ మెహర్ రమేష్ టీజర్ ని లాంచ్ చేశారు. మూవీని జులై 19న థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు.

ఇక ఫారిన్ లో చదువుకోవడానికి వెళ్లిన యూత్ కుర్రాళ్ళ లైఫ్ స్టైల్ నేపథ్యంలో కథ ఉన్నట్లు కనిపిస్తోంది. ఐదుగురు ఫ్రెండ్స్, వారి చేసే బర్త్ డే పార్టీ అల్లరితో టీజర్ ని కట్ చేశారు. పాతకాలం దూరదర్శన్ లో పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ బర్త్ డే విషెస్ చెప్పే యాంకర్ పాత్రలో రోహిణి కనిపించింది. ఈ రోజు మన గారాలపట్టి బాలు పుట్టినరోజు అంటే మనందరికీ పండగ రోజు అంటూ యాంకర్ గా రోహిణి విషెస్ చెప్పడంతో స్టార్ట్ చేసి రూమ్ లో కుర్రాళ్ళు అందరూ చేసే బర్త్ డే పార్టీ హంగామాని హైలైట్ చేశారు.

Read more!

చూడటానికి ఫన్ క్రియేట్ చేసే విధంగా ఈ టీజర్ లో, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, రోహిణి యాంకరింగ్ ప్రెజెంటేషన్, కుర్రాళ్ళ హంగామా కనిపిస్తోంది. టీజర్ ఎండింగ్ లో ఇద్దరు ఫారిన్ పోలీసులు కుర్రాళ్ళ దగ్గరకి వచ్చి అంత ఒకే కదా అని అడుగుతారు. టీజర్ చూస్తుంటే కొత్త కుర్రాళ్ళు కంటెంట్ ని కొత్తగానే చెప్పే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. యూత్ నుంచి ఎలాంటి కామెడీ డ్రామాలకి ఆదరణ ఉండటంతో క్లిక్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే మాట వినిపిస్తోంది.

టీజర్ లాంచ్ చేసిన మెహర్ రమేష్ మూవీ టీమ్ ని అభినందించారు. టీజర్ బాగుందని చెప్పారు. ఈ చిత్రంలో సమీర్ మళ్ళ, రవికృష్ణ, రాజీవ్ కనకాల కీలక పాత్రలలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. సమీర్ మళ్ళ లీడ్ రోల్ చేసినట్లు కనిపిస్తోంది. మరి ఈ మూవీ ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుందో వేచి చూడాలి.

Full View
Tags:    

Similar News