స్టార్స్ గురించి ఛార్మింగ్ స్టార్ ఏమన్నారంటే?
ఇలా ఓనటుడిగా అన్ని రకాల పాత్రలు పోషిస్తూ సంపూర్ణ నటుడిగా ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటున్నారు.
ఛార్మింగ్ స్టార్ శ్రీకాంత్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు పెద్ద ఫ్యామిలీ స్టార్. శ్రీకాంత్ సిని మాలంటే లేడీస్ లో ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉండేది. శ్రీకాంత్ సినిమా రిలీజ్ అవుతుందంటే? బుకింగ్స్ లో లేడీస్ క్యూ కట్టేవారు. ఆ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న ఒకే ఒక్క నటుడాయన. విలన్ గా కెరీర్ ప్రా రంభించిన ఫ్యామిలీ స్టార్ గా తారా స్థాయికి చేరిన నటుడు.
ప్రస్తుతం మళ్లీ కెరీర్ ఆరంభ దశకే చేరుకున్నారు. మళ్లీ ఇప్పుడు అన్ని రకాల పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నారు. హీరోగా ఛాన్స్ వస్తే హీరో..విలన్ ఛాన్స్ వస్తే విలన్...గెస్ట్ పాత్రలొస్తే ఆ తరహా పాత్రల్లోనూ నటిస్తున్నారు. ఇలా ఓనటుడిగా అన్ని రకాల పాత్రలు పోషిస్తూ సంపూర్ణ నటుడిగా ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటున్నారు. తాజాగా శ్రీకాంత్ టాలీవుడ్ స్టార్స్ గురించి తన అభిప్రాయాన్ని సరదాగా షేర్ చేసుకున్నారు.
`యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా అల్లరి. ఓసారి రోషన్ ఇంట్లో కనిపించకపోతే కంగారు పడుతున్నాం. ఇల్లాంతా వెతికినా ఎక్కడ కనిపించలేదుట. ఆసమయంలో కూల్ గా మా ఇంటికొచ్చి మా ఇంట్లో ఉన్నాడు అని అన్నారు. ఒకప్పడు ఇదరి ఇళ్లు పక్కపక్కనే ఉండేవన్నారు. తారక్ వెరీ ఎనర్జిటిక్ అనేసారు.
ఇక విక్టరీ వెంకటేష్ వెరీ హ్యాపీ పర్సన్. అలాంటి వ్యక్తిని ఇంతవరకూ చూడలేదు. జీవితాన్ని చాలా పాజి టివ్ గా తీసుకుంటారు. అలాగే ఉంటారన్నారు. చరణ్ సాప్ట్ గోయింగ్...మెచ్యూర్డ్. ఇక బాలయ్య బాబు తో ఏదైనా ఫేస్ టూ ఫేస్ అన్నట్లు ఉంటుంది. దాపరికాలుండవు. ఆయన భోళాశంకరుడు. ఇక చిరంజీవిగారు నా జీవితంలో కీలమైన వ్యక్తి. ఏడు సినిమాలు ప్లాప్ అయి డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. అప్పుడాయన దగ్గర కూర్చోబెట్టుకుని ధైర్యం` చెప్పారని అన్నారు. ఇటీవలే శ్రీకాంత్ `కోటబొమ్మాళి పీఎస్` సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.