హీరోయిన్‌ని పెళ్లాడిన `కోటక్ మహీంద్ర` వారసుడు!
జే కోటక్ షేర్వాణీ ధరించి ఉండగా, అదితి ఆర్య రెడ్ కలర్ లెహంగా ధరించింది.
బిలియనీర్ బ్యాంకర్ ఉదయ్ కోటక్ కుమారుడు జే కోటక్ ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్‌లో 2015 మిస్ ఇండియా విజేత, యువకథానాయిక అదితి ఆర్యను వివాహం చేసుకున్నాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో, జే కోటక్ ట్విట్టర్‌లో అదితి ఆర్యతో నిశ్చితార్థం చేసుకున్నట్లు ధృవీకరించారు. యేల్ విశ్వవిద్యాలయం నుండి MBA పూర్తి చేసిన సందర్భంలో అతిధిని X (గతంలో ట్విట్టర్)లో అభినందించాడు. “నా కాబోయే భార్య అదితి ఈరోజు యేల్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసింది. మీ గురించి చాలా గర్వంగా ఉంది” అని రాసాడు. అదితి ఆర్య తన గ్రాడ్యుయేషన్ రోబ్ & టోపీలో ఉన్న రెండు ఫోటోలను షేర్ చేసాడు. తాజాగా జే కోటక్ X (గతంలో ట్విట్టర్)లో షేర్ చేసిన ఓ ఫోటోలో అతిథుల మధ్య ఈ కొత్త జంట కనిపించింది. జే కోటక్ షేర్వాణీ ధరించి ఉండగా, అదితి ఆర్య రెడ్ కలర్ లెహంగా ధరించింది.
RPG గ్రూప్ చైర్‌పర్సన్ హర్ష్ గోయెంకా కొత్త జంటకు తన విషెస్ తెలిపారు.``సుందరమైన జంట. అద్భుతమైన వేడుకలలో మమ్మల్ని భాగం చేసినందుకు ధన్యవాదాలు. సంతోషంగా ఉండండి!`` అని రాసారు. నూతన వధూవరులకు నెటిజనుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మీ ఇద్దరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు... విష్ యు ఎ గ్రేట్ టైమ్ ఎహెడ్ అని ఆశీర్వదించారు.
అతిథులు ఎవరు?
బిలియనీర్ ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ వివాహ కార్యక్రమాలకు హాజరైన ఫోటోలు వైరల్ గా షేర్ అవుతున్నాయి. సినీరాజకీయ రంగ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, బ్యాంకర్లు ఈ పెళ్లికి హాజరయ్యారు.
అదితి ఆర్య ఎవరు?
చండీగఢ్‌లో పెరిగిన అదితి ఆర్య తన చదువు కోసం గురుగ్రామ్‌కు వెళ్లింది. నటి, మోడల్, రీసెర్చ్ అనలిస్ట్ .. ఆ తర్వాత అందాల పోటీ విజేత. అదితి 2015లో ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని గెలుపొందింది. అదితి ఆర్య MBA చదివేందుకు యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌కి వెళ్లింది. ఢిల్లీ యూనివర్సిటీలోని షహీద్ సుఖ్‌దేవ్ కాలేజ్ ఆఫ్ బిజినెస్ స్టడీస్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది.
అదితి ఆర్య ఎర్నెస్ట్ అండ్ యంగ్ అనే ఆడిట్ సంస్థలో అసోసియేట్ అనలిస్ట్‌గా పనిచేశారు. దర్శకుడు పూరీ జగన్నాధ్ చిత్రం `ఇజం`(కళ్యాణ్ రామ్ హీరో)తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. 2021లో రణవీర్ సింగ్ చిత్రం 83లో కూడా నటించింది. 1983 క్రికెట్ ప్రపంచ కప్‌ను గెలుచుకున్న కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు ఆధారంగా ఈ జీవిత చరిత్ర స్పోర్ట్స్ డ్రామా చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే.
జే కోటక్ కొలంబియా విశ్వవిద్యాలయం నుండి చరిత్ర - ఆర్థిక శాస్త్రంలో తన బ్యాచిలర్స్ డిగ్రీని పూర్తి చేసాడు. అతడు హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండి MBA చేసాడు. ప్రస్తుతం అతడు Kotak811 వైస్ ప్రెసిడెంట్.