'సలార్' లేడీ విలన్.. తగ్గేలా లేదు

తమిళంలో కొన్ని సినిమాలతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రియ రెడ్డి ఆ తర్వాత విశాల్ సోదరుడు విక్రమ్ ని పెళ్లి చేసుకుని ఫ్యామిలీ ఉమెన్ గా సెటిల్ అయిపోయింది.

Update: 2023-12-22 10:54 GMT

ఒకప్పటి కోలీవుడ్ నటీమణులు ఇప్పుడు టాలీవుడ్ లో లేడీ విలన్స్ గా సెటిలైపోతున్నారు. ఈ మధ్యకాలంలో తమిళనటి వరలక్ష్మి శరత్ కుమార్ టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో లేడీ విలన్ గా మెప్పించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో కోలీవుడ్ నటి కూడా అదే బాట పట్టింది. ఆమె మరెవరో కాదు శ్రియా రెడ్డి. ఈ జనరేషన్ వాళ్లకు ఈమె తెలియకపోవచ్చు. కానీ విశాల్ 'పొగరు' సినిమాలో లేడీ విలన్ గా అదరగొట్టిన అమ్మాయి అంటే అందరికీ వెంటనే గుర్తొచ్చేస్తుంది.

తమిళంలో కొన్ని సినిమాలతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రియ రెడ్డి ఆ తర్వాత విశాల్ సోదరుడు విక్రమ్ ని పెళ్లి చేసుకుని ఫ్యామిలీ ఉమెన్ గా సెటిల్ అయిపోయింది. నిజానికి ఈమె ఆరంగేట్రం మన తెలుగులోనే జరిగింది. చంద్ర సిద్ధార్థ దర్శకత్వంలో రాజా హీరోగా 2003లో వచ్చిన 'అప్పుడప్పుడు' అనే సినిమాతో శ్రియ రెడ్డి నటిగా కెరియర్ స్టార్ట్ చేసింది.

ఆ మూవీ సరైన రిజల్ట్ అందుకోకపోవడం, ఈమె స్కిన్ టోన్ నలుపు వర్ణంతో తమిళ ఫ్లేవర్ కి దగ్గరగా ఉండడంతో తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. తిరిగి మళ్ళీ ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత తెలుగులో ఈమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇవాళ రిలీజ్ అయిన పాన్ ఇండియా మూవీ సలార్ లో శ్రీయ రెడ్డి జగపతిబాబు కూతురుగా ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించింది. కథ పరంగా ఈ పాత్ర బతికే ఉంది కాబట్టి సలార్ రెండో భాగంలో ఈమెకు మరింత ఇంపార్టెన్స్ ఉండబోతోంది.

ఇక సలార్ తర్వాత శ్రియా రెడ్డి చేస్తున్న మరో తెలుగు సినిమా 'ఓజి'. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాలో డైరెక్టర్ సుజీత్ తనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర ఇచ్చాడని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. వీటి కంటే ముందు అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన 'సుజల్' అనే వెబ్ సీఐస్ తో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఇక ప్రభాస్, పవన్ కళ్యాణ్ సినిమాలు సక్సెస్ అయితే నటిగా శ్రేయ రెడ్డి దశతిరిగినట్టే అని చెప్పొచ్చు.ఎందుకంటే ప్రస్తుతం మన ఇండస్ట్రీలో లేడీ ఆర్టిస్టుల కొరత చాలా ఉంది.

అందులోనూ నెగటివ్ షేడ్స్ లో ఇంత బాగా నటించే వాళ్ళు దొరకడం అంటే చాలా కష్టం. అయితే శ్రియ రెడ్డి మాత్రం తన దగ్గరికి వచ్చిన అన్ని కథలను ఒప్పుకోదట. బాగా నచ్చితేనే సినిమా చేసేందుకు ఒప్పుకుంటుందనే టాక్ ఉండడంతో చాలామంది అగ్ర దర్శకులు ఈమెని పెద్దగా కలవడం లేదని చెబుతున్నారు. ఇక సలార్ లో ఈమె కంటే సీనియర్ అయిన ఈశ్వరి రావు, ఝాన్సీల కన్నా ఎక్కువ స్కోప్ ఉన్న పాత్ర శ్రియ రెడ్డికే దక్కడం విశేషం. మరి సలార్ శ్రీయా రెడ్డి కెరీర్ కి ఎలా హెల్ప్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News