ప్రేమలు 2 కథ ఇదే అయ్యుండొచ్చా..?
ప్రేమలు సినిమా చూసిన తర్వాత మమితా బైజు గురించి సోషల్ మీడియాలో వెతకడం మొదలు పెట్టారు.
మలయాళంలో ఈమధ్య కాలంలో వచ్చి సూపర్ హిట్ అందుకున్న సినిమా ప్రేమలు. గిరీష్ ఏ.డి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో నెస్లన్, మమితా బైజు లీడ్ రోల్స్ గా నటించారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో కార్తికేయ రిలీజ్ చేశారు. తెలుగులో కూడా యూత్ ఆడియన్స్ అందరినీ ఈ సినిమా అలరించింది. ప్రేమలు సినిమా చూసిన తర్వాత మమితా బైజు గురించి సోషల్ మీడియాలో వెతకడం మొదలు పెట్టారు. సౌత్ అంతా కూడా అమ్మడు ట్రెండింగ్ లో ఉంటూ వచ్చింది.
సౌత్ లో ఈ సినిమాపై ఉన్న క్రేజ్ ను వాడుకునేందుకు ప్రేమలు సీక్వల్ ప్రకటించారు మేకర్స్. ప్రేమలు 2 త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతుందని తెలుస్తుంది. అయితే ప్రేమలు కథనే కొనసాగించి పార్ట్ 2 ని తెరకెక్కిస్తారని టాక్. అలా అయితే ప్రేమలు 2 కథ ఇదే అయ్యుంటుందని చెప్పొచ్చు. ఇంతకీ ప్రేమలు 2 కథ ఎలా ఉండొచ్చు అంటే.. సచిన్ స్టడీస్ కోసం యూకేకి వెళ్తే రీను హైదరాబాద్ లోనే జాబ్ చేస్తుంది. సచిన్ ప్రేమను అంగీకరించిన రీను మీద ఆఫీస్ లో ఉన్న ఆది పగ పెంచుకుంటాడు. ఆమెను ఇబ్బంది పెడుతుంటే ఆ జాబ్ కి రిజైన్ చేస్తుంది రీను.
అయితే రీను కి బయట ఎక్కడా కూడా జాబ్ రాకుండా చేస్తుంటాడు. ఆ టైం లో రీను కి తన చైల్డ్ హుడ్ ఫ్రెండ్ ఒకరు కలిసి తనకు హెల్ప్ చేస్తాడు. యూకే లో కూడా సచిన్ కు ఒక అమ్మాయి క్లోజ్ అవుతుంది. జాబ్ లేక రీను కాస్త ఇబ్బందుల్లో ఉంటే సచిన్ తనకు ఏమి పట్టనట్టుగా ఉంటాడు. ఆ టైం లో సచిన్ రీనుల మధ్య కొంత డిస్టర్బన్స్ వస్తుంది. ఇద్దరు మళ్లీ ఎవరికి వారు అన్నట్టు ఉంటారు. అయితే ఆ టైం లో సచిన్ ఇండియాకు వస్తాడు. సచిన్ రీను ఒకరికొకరు ఎదురుపడ్డా మాట్లాడుకోరు.
మళ్లీ ఈ ఇద్దరు ఎలా కలుస్తారు. సచిన్, రీనుల మధ్య దూరం ఎలా దగ్గరవుతుంది.. మళ్లీ వాళ్లు ఎలా కలుస్తారు అన్నదే ప్రేమలు 2 కథ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే ప్రేమలు 2 మరింత ఫన్ ఉంటుందని మేకర్స్ చెబుతున్నా ఫన్ తో పాటు హీరో హీరోల మధ్య ఎమోషనల్ సీన్స్ కూడా అంతే ఆకట్టుకునేలా ఉంటాయని చెప్పొచ్చు. ప్రేమలు 2 ను మలయాళంతో పాటుగా తెలుగు, తమిళ ఆడియన్స్ ముందుకు ఒకేసారి తెచ్చేలా ఉన్నారు. తెలుగులో కూడా ప్రేమలు సూపర్ హిట్ అయిన సందర్భంగా తెలుగు ప్రేక్షకులను మెప్పించేలా కూడా ప్రేమలు 2 ని తెరకెక్కిస్తారని తెలుస్తుంది.