హీరో గారి ఫస్ట్ డిజిటల్ ప్రాజెక్ట్ రిజల్ట్ ఏంటో తెలుసా..!
ఆర్య మొదటి వెబ్ సిరీస్ 'ది విలేజ్' ను స్ట్రీమింగ్ చేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా ఆసక్తి రేకెత్తిస్తూ వచ్చిన ది విలేజ్ వెబ్ సిరీస్ కి ప్రేక్షకుల నుంచి నెగటివ్ టాక్ వస్తోంది.
తమిళంలో హీరోగా మరియు విలన్ గా కూడా అలరించిన ఆర్య డిజిటిల్ ప్లాట్‌ఫామ్ పై ఎంట్రీ ఇచ్చాడు. తెలుగు ప్రేక్షకులకు కూడా వరుడు సినిమా తో విలన్ గా పరిచయం అయిన ఆర్య ఆ తర్వాత పలు సినిమాల ద్వారా సుపరిచితుడు. అందుకే ఆర్య వెబ్ సిరీస్ పై అక్కడ ఇక్కడ కూడా పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.
తమిళ్ తో పాటు సౌత్ లో అన్ని భాషల్లో మరియు హిందీలో కూడా ఆర్య మొదటి వెబ్ సిరీస్ 'ది విలేజ్' ను స్ట్రీమింగ్ చేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా ఆసక్తి రేకెత్తిస్తూ వచ్చిన ది విలేజ్ వెబ్ సిరీస్ కి ప్రేక్షకుల నుంచి నెగటివ్ టాక్ వస్తోంది. ముఖ్యంగా సిరీస్ లోని చివరి మూడు నాలుగు ఎపిసోడ్ లు చూడ్డానికి కూడా వీలు లేనంత హింస ను కలిగి ఉన్నాయి అంటున్నారు.
కొన్ని సన్నివేశాల్లో దెయ్యం పేరు చెప్పి అత్యంత దారుణమైన విజువల్స్ ను దర్శకుడు మిలింద్ రావు జొప్పించాడు అంటూ విమర్శలు వస్తున్నాయి. వెబ్ సిరీస్ కి రివ్యూలు కూడా నెగటివ్ గానే వచ్చాయి. గతంలో హర్రర్ కాన్సెప్ట్ లను చక్కగా డీల్ చేసిన మిలింద్ రావు ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ను శృతిమించిన హింసతో చూపించాడు అంటూ కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
వెబ్ సిరీస్ అయినంత మాత్రాన మరీ అంతగా హింసను చూపించాలా అంటూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక విలేజ్ లో ఉన్న అంతుపట్టని రహస్యం ను డాక్టర్ గౌతమ్ ఎలా ఛేదించాడు అనే కథ తో ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు.
స్టోరీ లైన్ బాగానే ఉన్నా.. దాన్ని నడిపించిన తీరు అసలేం బాగోలేదు అంటున్నారు. ఆర్య వంటి హీరో వెబ్ సిరీస్ కి ఎంట్రీ ఇవ్వడం శుభపరిణామం. కానీ ఆయన కు ఇలాంటి ఫ్లాప్ పడటంతో ముందు ముందు వెబ్ సిరీస్ లు చేసేందుకు ఆసక్తి చూపించేనా అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.