'సలార్'.. వరల్డ్ వైడ్ టార్గెట్ ఎంతంటే?
సలార్ మూవీ ప్రపంచవ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఏకంగా రూ.800 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'సలార్' మూవీ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. కాగా ప్రపంచవ్యాప్తంగా సలార్ మూవీకి భారీ బిజినెస్ జరిగింది. అందుకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి.
సలార్ మూవీ ప్రపంచవ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఏకంగా రూ.800 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. ఏరియా వైజ్ గా చూసుకుంటే.. తెలంగాణలో సలార్ మూవీ రైట్స్ రూ.65 కోట్లకు అమ్ముడయ్యాయి. ఈ లక్ష్యాన్ని చేదించాలంటే ఈ మూవీ దాదాపు రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో సలార్ థియెట్రీకల్ రైట్స్ రూ.95 కోట్లు, అంటే అక్కడ ఏకంగా రూ.150 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. తెలంగాణ, ఏపీ రెండు తెలుగు రాష్ట్రాల్లో సలార్ బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే దాదాపు రూ.250 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుంది.
ఇవి కాకుండా కర్ణాటక, కేరళ, తమిళనాడు ఇతర దక్షిణాది రాష్ట్రాలలో సలార్ నిర్మాతలు సొంతంగా ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. అక్కడి వ్యాల్యుడ్ బిజినెస్ ప్రకారం చూసుకుంటే మూడు రాష్ట్రాలకు కలిపి సినిమాకి సుమారు రూ.65 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ మూడు రాష్ట్రాల్లో రూ.130 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే సలార్ బ్రేక్ ఈవెన్ అయినట్లే. ఇక ప్రపంచవ్యాప్తంగా సలార్ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.800 కోట్ల గ్రాస్ రాబట్టాలి.
సో టోటల్ గా సౌత్ ఇండియన్ నుంచి ఈ మూవీ రూ.380 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. నార్త్ ఇండియాలో బిజినెస్ వాల్యూ ప్రకారం బ్రేక్ ఈవెన్ కోసం రూ.230 కోట్ల గ్రాస్ రాబట్టాలి. సౌత్, నార్త్ రెండు కలిపితే ఇండియా వైడ్ గా రూ.610 కోట్ల గ్రాస్ రాబడితే సలార్ బ్రేక్ ఈవెన్ అయినట్లు లెక్క. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే, ఈ మూవీ పబ్లిసిటీ ప్రింట్ ఖర్చులతో సహా రూ.75 కోట్లకు అమ్ముడైంది.
అక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.150 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేయాలి. అలా మొత్తం వరల్డ్ వైడ్ ఈ మూవీ రూ.800 కోట్ల గ్రాస్, రూ.400 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది. మరి భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న 'సలార్' బ్రేక్ ఈవెన్ సాధించి నిర్మాతలకు లాభాలను అందిస్తుందా? లేక నష్టాలను తెచ్చి పెడుతుందా? అనేది చూడాలి.