నా సినిమాను వాళ్లు బాత్‌రూమ్ లో చూసుకుంటారు
సెన్సార్ ఇబ్బందులు, కోర్టు కేసులను దాటుకుని ఎన్నికల ముందే ఈ రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు వర్మ తీసుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు.
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన పొలిటికల్ డ్రామా చిత్రాలు వ్యూహం మరియు శపథం బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాయి. సెన్సార్ ఇబ్బందులు, కోర్టు కేసులను దాటుకుని ఎన్నికల ముందే ఈ రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు వర్మ తీసుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు.
ఫిబ్రవరి 23న వ్యూహం సినిమా రాబోతుండగా దానికి సీక్వెల్ గా రూపొందిన శపథం మూవీని మార్చి 1న అంటే వారం రోజుల గ్యాప్ లోనే రెండు సినిమాలను తీసుకు రాబోతున్నాడు. ఏపీలో ఈ సినిమాను తెలుగు దేశం, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు చూస్తారా అంటూ ఒక చిట్ చాట్ లో అడిగిన ప్రశ్నకు వర్మ నుంచి ఆసక్తికర సమాధానం వచ్చింది.
ఒకప్పుడు సికింద్రాబాద్ లో లంబా థియేటర్ ఉండేది. ఆ థియేటర్ లో బూతు సినిమాలు ఆడేవి. బూతు సినిమాలు అంటే ఇష్టం ఉండి కూడా చాలా మంది ఆ సినిమాలు చూసేందుకు భయపడేవారు. కానీ లంబా థియేటర్ చాలా సమాజ సేవ చేసింది.
నేను బూతు సినిమాలు ఎలాగ అయితే చూస్తానో అలాగే తెలుగు దేశం మరియు జనసేన పార్టీ వారు కూడా మా వ్యూహం మరియు శపథం సినిమాలను వారి బాత్ రూమ్ ల్లోకి వెళ్లి చూస్తారు. న్యూట్రల్ గా ఉండే వారు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా లివింగ్ రూమ్ లో కూర్చుని చూస్తారు.
బాక్సింగ్ రింగ్ లో దిగినం అంటే గట్టిగానే గుద్దాలి. జుట్టు పీకుతాను, లేదంటే చిన్నగా కొడతాను అంటే కరెక్ట్ కాదు. అందుకే నేను ఏదైనా సినిమా తీయాలి అనుకుంటే అన్ని విషయాలను బట్టలు ఊడదీసి చూపించినట్లుగా చూపిస్తాను అంటూ వర్మ తాజా చిట్ చాట్ లో వ్యాఖ్యలు చేశాడు. మొత్తానికి పొలిటికల్ గా వర్మ వ్యూహం మరియు శపథం సినిమాలు ఏదో ప్రభావం చూపడం, వివాదం రేపడం ఖాయంగా కనిపిస్తోంది.