ఈ ఏడాది టాలీవుడ్ హిట్ సినిమాలివే..

2024లో టాలీవుడ్ నుంచి సుమారు 180+ సినిమాలు థియేటర్స్ లోకి వచ్చాయి.

Update: 2024-09-18 04:17 GMT

2024లో టాలీవుడ్ నుంచి సుమారు 180+ సినిమాలు థియేటర్స్ లోకి వచ్చాయి. వీటిలో చిన్న సినిమాల నుంచి పాన్ ఇండియా మూవీస్ వరకు అన్ని ఉన్నాయి. మెజారిటీగా లోబడ్జెట్ తో వచ్చిన చిన్న చిత్రాలే ఉన్న కూడా ప్రతి నెల కొద్దో గొప్పో ఫేమ్ ఉన్న హీరో థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకి వస్తూనే ఉన్నాడు. జనవరిలో, ఫిబ్రవరి నెలల్లో ఎక్కువ సినిమాలు రిలీజ్ అయ్యాయి. తరువాత మార్చి నుంచి ఓ వైపు ఐపీఎల్, మరో వైపు ఎన్నికల ఎఫెక్ట్ సినిమాలపై పడింది.

దీంతో స్టార్స్ ఎవరు ఆ మూడు నెలలు థియేటర్స్ లోకి వచ్చే సాహసం చేయలేదు. తరువాత మరల సినిమాల సందడి మొదలైంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది టాలీవుడ్ సినిమాల సక్సెస్ శాతం చాలా వరకు తగ్గింది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాలలో కమర్షియల్ హిట్ అయిన మూవీస్ జాబితా చూసుకుంటే కేవలం 10% మాత్రమే సక్సెస్ ఉంది. వాటిలో ఎక్కువగా చిన్న సినిమాలు సక్సెస్ లు అందుకోవడం విశేషం.

జనవరిలో రిలీజ్ అయిన సినిమాలలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘హనుమాన్’ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. 300 కోట్ల కలెక్షన్స్ ని అందుకుంది. అలాగే కింగ్ నాగార్జున ‘నా సామిరంగా’ మూవీ కమర్షియల్ హిట్ అయ్యింది. గీతా ఆర్ట్స్ 2లో సుహాస్ హీరోగా వచ్చిన ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ మూవీ కమర్షియల్ హిట్ గా నిలిచింది. విశ్వక్ సేన్ ప్రయోగాత్మకం చిత్రం ‘గామి’ హిట్ కొట్టింది. వీటి తర్వాత సిద్దు జొన్నలగడ్డ ‘టిల్లు స్క్వేర్’ మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నారు.

శ్రీవిష్ణు హీరోగా వచ్చిన ‘ఓం భీమ్ బుష్’ మూవీ కమర్షియల్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.. డార్లింగ్ ప్రభాస్ ‘కల్కి 2898ఏడీ’ హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మొదటి ఆరు నెలల్లో కేవలం 8 కమర్షియల్ హిట్స్ మాత్రమే టాలీవుడ్ లో వచ్చాయి. అదే ఆగష్టు, సెప్టెంబర్ నెలల్లో ఏకంగా ఐదు సక్సెస్ లు వచ్చాయి. వాటిలో 4 చిన్న సినిమాలే ఉండటం విశేషం.

నిహారిక నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ డబుల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. బన్నీ వాస్ నిర్మించిన ‘ఆయ్’ మూవీ డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నాని ‘సరిపోదా శనివారం’ సూపర్ హిట్ అయ్యింది. నివేదా థామస్ ‘35 చిన్న కథ కాదు’ హిట్ బొమ్మగా మారింది. శ్రీసింహ ‘మత్తు వదలరా 2’ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. ఇవి కాకుండా బ్రేక్ ఈవెన్ వరకు వచ్చి సెమీ హిట్ గా నిలిచినా చిత్రాలలో విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’, కార్తికేయ ‘భజే వాయువేగం’, సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన’ ఉన్నాయి. ఇకపై రాబోయే సినిమాలు ఎన్ని హిట్ అవుతాయనేది వేచి చూడాలి.

హనుమాన్ – క్వాడ్రపుల్ బ్లాక్‌బస్టర్

నా సామిరంగా – హిట్

అంబాజిపేట మ్యారేజ్ బ్యాండ్ – హిట్

గామి – హిట్

ఓం భీమ్ బుష్ – హిట్

టిల్లు స్క్వేర్ – డబుల్ బ్లాక్‌బస్టర్

మనమే – హిట్

కల్కి 2898ఏడీ – భారీ బ్లాక్‌బస్టర్

కమిటీ కుర్రోళ్ళు – డబుల్ బ్లాక్‌బస్టర్

ఆయ్ – డబుల్ బ్లాక్‌బస్టర్

సరిపోదా శనివారం – సూపర్ హిట్

35 చిన్న కథ కాదు – హిట్

మత్తు వదలరా 2 – హిట్

Tags:    

Similar News