మే 31న ఆ ముగ్గురైనా ఊపు తెస్తారా?
తెలంగాణ-ఏపీలో థియేటర్లు మూత పడిన సంగతి తెలిసిందే. కొత్త సినిమా రిలీజ్ లు లేకపోవడంతో తాత్కాలికంగా తాళాలు వేసి కూర్చున్నారు.
తెలంగాణ-ఏపీలో థియేటర్లు మూత పడిన సంగతి తెలిసిందే. కొత్త సినిమా రిలీజ్ లు లేకపోవడంతో తాత్కాలికంగా తాళాలు వేసి కూర్చున్నారు. మల్టీప్లెక్స్ ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇంగ్లీష్ సినిమాలు వేసుకోవడం తప్పా! వేసుకుందామంటే తెలుగు సినిమా కనిపించని పరిస్థితి. ఇటీవలే దిల్ రాజు వారసుడు అశిష్ నటించిన `లవ్ మీ` రిలీజ్ తో కొన్ని థియేటర్లు తెరుచుకున్నా సినిమాకి పెద్దగా సౌండింగ్ రాలేదు. దీంతో థియేటర్లు తెరుచుకున్నా లాభం లేకుండా పోయింది.
మరి ఈనెల 31 నుంచైనా థియేటర్లకు శోభ తోడవుతందా? లేదా? అన్నది చూడాలి. ఆ రోజు మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తోన్న `గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి`...యువ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తోన్న `గం గం గణేశా`...కార్తీకేయ నటిస్తోన్న `భజే వాయు వేగం` రిలీజ్ అవుతున్నాయి. మూడు ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి కాబట్టి చాలా థియేటర్ల అవసరం ఉంటుంది. రెండు రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున ఆ చిత్రాలు రిలీజ్ కానున్నాయి.
మూడు సినిమాలకు సరిసమానంగా థియేటర్లు సర్దుబాటు చేస్తారు. ఎన్నిరోజులు కావాలనుకుంటే అన్ని రోజులు ఆడించుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ సత్తా చాటాల్సింది మాత్రం ఆ ముగ్గురే. మూడు సినిమాలకు ఎంత పాజిటివ్ టాక్ వస్తే అంత మంచింది. ఆ సినిమాలకు అంత గొప్ప లాంగ్ రన్ అవకాశం ఉంటుంది. జనాలు కూడా థియేటర్లు మూత పాడటంతో బోర్ ఫీలవుతున్నారు. థియేటర్ కి వెళ్లి సినిమా ఎప్పుడు చూద్దామా? అని ఓ సెక్షన్ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు.
అలాంటి వాళ్లందరూ మే 31 ఎంచక్కా ఆ మూడు సినిమాల్ని ఓపెనింగ్ డే ని ఆస్వాదించొచ్చు. ఆ సినిమాలకు మంచి టాక్ వస్తే మిగతా జనం క్యూ కట్టే అవకాశం ఉంటుంది. ఆన్ లైన్ లీక్ కాకుండా చూసుకుంటే ఆ సినిమాలకు మంచి వసూళ్లు పెరిగే అవకాశం ఉంటుంది. మరి ఎవరి సినిమాలో దమ్ము ఎంతో నిరూపించుకోవాల్సిన బాధ్యత మాత్రం ఆహీరోలతే. `మా సినిమాకి థియేటర్లు దొరకలేదు..అందుకే సినిమా కిల్ అయిపోతుందని వాపోయే వాళ్లంతా` థియేటర్లు దొరికిన తర్వాత ఎలా ఉంటుందో? ఈ మూడు సినిమాల సక్సెస్ ని బట్టి చెప్పొచ్చు.